ఆరు ఎకరాలు బ్రహ్మోస్‌కే .. | - | Sakshi
Sakshi News home page

ఆరు ఎకరాలు బ్రహ్మోస్‌కే ..

Sep 26 2026 1:26 AM | Updated on Sep 26 2026 1:26 AM

ముగ్గురు అన్నదమ్ములమైన మాకు ఉన్న మొత్తం 6 ఎకరాల భూమి బ్రహ్మోస్‌ ప్రాజెక్టు కోసం సేకరణలోకి వచ్చింది. పరిహారం వస్తుంది.. కానీ జీవనాధారమైన పొలం మొత్తం పోతుంది. ఇక ముందు ఏం చేయాలో భయంగా ఉంది. పరిహారంతో పాటు ఉపాధి కూడా కల్పించాలి.

– విజయ్‌, రైతు, జీన్గురాల

ముందుగా దారి ఏర్పాటు చేయాలి

డోకూర్‌లో డబ్లింగ్‌ పనుల కోసం గుర్తించిన స్థలంలో గ్రామ పంచాయతీ రోడ్డు ఉంది. ఇది కొత్త కాలనీలు, పొలాలు, దేవరకద్రకు వెళ్లే ప్రధాన మార్గం. భూములు తీసుకుంటే పొలాలకు వెళ్లే దారి లేకుండా పోతుంది. ఇప్పటికే అండర్‌ బ్రిడ్జి కారణంగా పలు కాలనీలకు రాకపోకల్లో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మరో సమస్య ఏర్పడుతుంది. ముందుగా ప్రత్యామ్నాయ దారి ఏర్పాటు చేసిన తర్వాతే పనులు చేపట్టాలి. – శ్రీనివాసులు, సర్పంచ్‌, డోకూర్‌

చారిత్రాత్మక గుర్తింపు

మూడు భారీ ప్రాజెక్టులతో దేవరకద్రకు చారిత్రాత్మక గుర్తింపు రానుంది. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా బ్రహ్మోస్‌ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత లభించేలా కృషి చేస్తాను.

– మధుసూదన్‌ రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement