హైదరాబాద్–పనాజీ కారిడార్‌లోని ఎన్‌హెచ్–167 దేవసూగురు–జడ్చర్ల సెక్షన్‌ను నాలుగు లేన్లుగా విస్తరించే భారత్‌మాల ప్రాజెక్టు పనులు దేవరకద్ర పరిధిలో చురుగ్గా సాగుతున్నాయి. నాలుగు గ్రామాల పరిధిలో వ్యవసాయ భూములతో పాటు ప్లాట్లు, నాలా కన్వర్షన్ భూములను భూసేకరణలోకి తీసుకున్నారు. దేవరకద్రలో 71 మంది రైతులకు చెందిన 25 ఎకరాలు, ప్లాట్లు కలిపి 169 మంది ప్రభావితమవుతుండగా రూ.11.32 కోట్లకుపైగా పరిహారం ప్రకటించారు. బల్సుపల్లిలో 33 మంది రైతులకు చెందిన 14.09 ఎకరాలతో పాటు ప్లాట్లు కలిపి 120 మందికి రూ.15.76 కోట్లకు పైగా, గోప్లాపూర్‌లో 76 మంది రైతులకు చెందిన 22.03 ఎకరాలతో పాటు ప్లాట్లు కలిపి 203 మందికి రూ.17.39 కోట్ల పరిహారం ప్రకటించారు. చౌదర్‌పల్లిలో 67 మంది రైతులకు చెందిన 11.32 ఎకరాలతో పాటు ప్లాట్లు కలిపి భూయజమానులకు రూ.11.21 కోట్ల పరిహారం మంజూరైంది. దాదాపు అందరికీ పరిహారం చెల్లింపులు పూర్తికావడంతో భారత్‌మాల బైపాస్ పనులు వేగం పుంజుకున్నాయి.


