పట్టాల విస్తరణకు.. 247 మంది రైతుల భూములు | - | Sakshi
Sakshi News home page

పట్టాల విస్తరణకు.. 247 మంది రైతుల భూములు

Sep 26 2026 1:26 AM | Updated on Sep 26 2026 1:26 AM

రైల్వే డబ్లింగ్‌ పనుల కోసం ఐదు గ్రామాల పరిధిలో 247 మంది రైతులకు చెందిన పట్టా భూములను సేకరించారు. వెంకటాయపల్లిలో 2.25, బల్సుపల్లిలో 4.20, దేవరకద్రలో 5, డోకూర్‌లో 8.07, గోపన్‌పల్లిలో 5.03 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. దేవరకద్ర మినహా మిగతా గ్రామాల్లో పరిహారం చెక్కులు సిద్ధమయ్యాయి. వెంకటాయపల్లికి రూ.46.56 లక్షలు, బల్సుపల్లికి రూ.88.79 లక్షలు, గోపన్‌పల్లికి రూ.80.62 లక్షలు, డోకూర్‌కు రూ.1.24 కోట్ల పరిహారం చెల్లించనున్నారు. అయితే డోకూర్‌లో సర్వే చేసిన భూమిలో పొలాలు, కాలనీలకు వెళ్లే దారి ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసిన తర్వాతే చెక్కులు తీసుకుంటామని రైతులు చెబుతున్నారు. మరోవైపు డబ్లింగ్‌ పనులు మాత్రం వేగంగా సాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement