‘సాక్షి’ కథనంతో కదిలిన యంత్రాంగం | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ కథనంతో కదిలిన యంత్రాంగం

Sep 24 2026 2:12 AM | Updated on Sep 24 2026 2:12 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లా కేంద్రంలోని చౌరస్తాల్లో నిర్వహణ లోపంతో కళతప్పిన ఆకృతులు, పనిచేయని ఫౌంటెయిన్లపై బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘కళతప్పిన ఆకృతులు’ కథనానికి అధికారులు స్పందించారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ నగరంలోని పలు ప్రాంతాల్లోని ఆకృతులు, ఫౌంటెయిన్లను పరిశీలించారు. న్యూటౌన్‌ చౌరస్తాలోని టీపాట్‌ ఫౌంటెన్‌, అశోక్‌టాకీస్‌ చౌరస్తాలోని ఫౌంటెయిన్లను కమిషనర్‌ రామాంజులారెడ్డితో కలిసి తనిఖీ చేశారు. ఫౌంటెయిన్లు ఎందుకు పనిచేయడం లేదనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాడైన వాటికి 24 గంటల్లో మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. విరిగిపోయిన కళాకృతులను కూడా వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. చౌరస్తాల్లోని కళాకృతుల పరిసరాల్లో చెత్తా చెదారం లేకుండా చూడటంతో పాటు మొక్కలు పెరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొన్ని ఫౌంటెయిన్లు పనిచేసే స్థితిలో ఉన్నప్పటికీ.. వాటికి నీటిని సరఫరా చేసే పంపులను సకాలంలో ఆన్‌, ఆఫ్‌ చేయకపోవడంతో వినియోగంలోకి రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై కార్పొరేషన్‌ చైర్మన్‌ రామాంజులారెడ్డిని వివరణ కోరగా.. ఫౌంటెయిన్లను త్వరగా మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకొస్తామని, విరిగిపోయిన కళాకృతులను కూడా పునరుద్ధరిస్తామని తెలిపారు.

కళతప్పిన ఆకృతులనుపరిశీలించిన అధికారులు

ఫౌంటెయిన్లను పునరుద్ధరణ, 24 గంటల్లో మరమ్మతులు చేయాలని ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement