ఉక్కుపాదం మోపుతాం
ఇసుక తరలింపును అరికడుతాం
● జోరుగా ఇసుక అక్రమ రవాణా
● బెంజ్‌లు, టిప్పర్ల ద్వారా దోపిడీ
● పట్టించుకోని పోలీసు,
రెవెన్యూ యంత్రాంగం
● రైతులే అడ్డుకుని ఠాణాకు
వాహనాల తరలింపు
చిన్నచింతకుంట: చిన్నచింతకుంట మండంలోని వివిధ గ్రామాల్లో అక్రమ ఇసుక తరలింపు జోరుగా కొనసాగుతుంది. అభివృద్ధి పనుల పేరిట కొందరు ఇసుక బకాసురులు రాత్రింభవళ్లు తేడాలేకుండా ఊకచెట్టు వాగునుంచి ఇసుకను తోడేస్తున్నారు. భారత్ బెంజ్ వాహనాలు, టిప్పర్లకు జేసీబీ, హిటాచీల ద్వారా నింపి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవహారం పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి. అయితే ఇసుక తరలింపు కొనసాగితే భూగర్భ జలా లు అడగంటిపోయి వాగు పరిసర ప్రాంతాల్లోని గ్రామాలకు తాగు, సాగు నీటి ఇబ్బందులు ఏర్పడుతాయన్న ఉద్దేశంతో రైతులు ఇసుక అక్రమ తరలింపును అరికట్టేందుకు నడుము బిగించారు. రాత్రి సమయంలో కాపు కాస్తూ ఇసుక వాహనాలను అ డ్డుకుంటున్నారు. తాజాగా సోమవారం రాత్రి మండలంలోని బండ్రపల్లి ఊకచెట్టు వాగునుంచి కొంద రు అక్రమార్కులు ఏడు భారత్ బెంజ్ వాహనాలు, ఒక హిటాచీ, జేసీబీతో ఇసుకను తరలిస్తుండగా బండ్రపల్లి రైతులు మాటువేసి పట్టుకున్నారు. వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి పోలీసుల కు అప్పగించారు. వారం రోజుల క్రితం కూడా పల్లమర్రి, ముచ్చింతల మధ్య రాత్రి సమయంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను రైతులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. ఇంత జరిగి నా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చలించకపోవడంతో గ్రామాల్లో పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికార పార్టీ అండదండలతో..
మండలంలోని మద్దూర్, పల్లమర్రి, లాల్‌కోట, బండ్రపల్లి, అల్లీపురం, కౌకుంట్ల మండలంలోని తిర్మలాపురంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇసుక తరలింపును గత కొన్నిరోజులుగా జోరుగా కొనసాగిస్తున్నారు. అల్లీపురం, మద్దూరు, తిర్మలాపురం నుంచి ట్రాక్టర్ల ద్వారా ఆత్మకూర్, అమరచింత, కౌకుంట్ల మండలాలకు తరలిస్తున్నారు. పల్లమర్రి, ముచ్చింతల, బడ్రపల్లి, లాల్‌కోట నుంచి భారత్‌బెంజ్, టిప్పర్ల ద్వారా మహబుబ్‌నగర్, హైదరాబాద్ తదతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్‌కు రూ.5నుంచి 6వేయిల చొప్పున టిప్పరుకు 20నుంచి 30వేల చొప్పున దండుకుంటున్నారు.
చిన్నచింతకుంట మండలం బండ్రపల్లి గ్రామం వద్ద రైతులు పట్టుకున్న అక్రమ ఇసుక వాహనాలు
ఇసుక అక్రమ తరలింపుపై ఉక్కుపాదం మోపుతాం. వారంరోజులుగా వినాయక చవితి వేడుకలు, నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందుకు సిబ్బంది కొరత కారణంగా అక్రమార్కులు ఇసుక తరలింపుపై ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఇకపై కఠిన చర్యలు చేపట్టి అక్రమ తరలింపును అరికడుతాం.
– రామకృష్ణ, సీఐ, భూత్పూర్
గ్రామాల్లో కొనసాగుతున్న ఇసుక అక్రమ తరలింపును అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇదివరకే అన్నిశాఖల సమన్వయంతో కమి టీని వేసి పర్యవేక్షిస్తూ వ చ్చాం. ఇప్పడు కూడా అదేమాదిరిగా గ్రామాల్లో పర్యవేక్షించి అక్రమ తరలింపును అరికడుతాం.
– ఎల్లయ్య, తహసీల్దార్, చిన్నచింతకుంట


