అడుగంటనున్న భూగర్భజలాలు | - | Sakshi
Sakshi News home page

అడుగంటనున్న భూగర్భజలాలు

Sep 24 2026 2:18 AM | Updated on Sep 24 2026 2:18 AM

అడుగంటనున్న భూగర్భజలాలు

ఇసుక అక్రమ తరలింపు ఇలాగే కొనసాగితే వాగు పరిసర ప్రాంతాల్లోని గ్రామాల రైతులకు తాగు, సాగునీటికి ఇబ్బందులు ఏర్పడనున్నాయి. అక్రమార్కులు ఇసుకను తోడేస్తే భూగర్భజలాలు అడగంటిపోతాయి. వాగు పరిసర ప్రాంతాల రైతుల బోరుపంపులకు నీరు అందక రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతాయి. అంతేకాక ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకు ఇసుక తరలింపును అడ్డుకోవాలని పలుమార్లు పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆయా గ్రామాల రైతులు మండిపడుతున్నారు. అంతేకాక ఇసుక రవాణా కొనసాగుతుందని పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇస్తే ఘటనాస్థలానికి వచ్చి అక్రమార్కులతో చేతులు కలిపి వెళ్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు రైతులే ఇసుక రవాణాను అరికట్టేందుకు నడుం బిగిస్తున్నట్లు పలువురు రైతులు తెలుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement