ఏక్లాస్‌పూర్‌లో ‘ఏక’దంతుడి సేవ | - | Sakshi
Sakshi News home page

ఏక్లాస్‌పూర్‌లో ‘ఏక’దంతుడి సేవ

Sep 24 2026 2:18 AM | Updated on Sep 24 2026 2:18 AM

నారాయణపేట: తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో ని ఎక్లాస్‌పూర్‌లో వినాయక చవితి వేడుకలకు ప్ర త్యేక చరిత్ర ఉంది. 1968లో శ్రీ గోవిందరాజుల స్వామి దేవాలయంలో ఐదుగురితో ప్రారంభమైన గణనాథుడి పూజలు 58 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. తరాలు మారినా గ్రామస్తులు సంప్రదా యాన్ని కొనసాగిస్తూ ఏకదంతుడి సేవలో పాల్గొంటున్నారు.

● లడ్డి రాధాకృష్ణ, బండ గుండ వేమారెడ్డి, బోస్లే శ్రీనివాసరావు, కోమటి సుశీలమ్మ, తిరికి రెడ్డి యశోద కలిసి తొలిసారిగా వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. తొలినాళ్లలో కొన్ని కుటుంబాల్లో వరుస మరణాలు సంభవించడంతో విగ్రహ ప్రతిష్ఠపై విమర్శలు వచ్చినా వారు వెనుకడుగు వేయలేదు. కాలక్రమంలో గ్రామస్తులు, యువకులు ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు. అప్పట్లో ఎద్దుల బండిపై గణనాథుడిని ఊరేగించి నిమజ్జనానికి తరలించేవారు.

● ప్రస్తుతం యువకులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చివరి రోజు అడుగుల భజనలు, కోలాటం, చెక్కభజన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడో రోజు అన్నప్రసాదం, తొమ్మిదో రోజు ప్రతి ఇంటికీ స్వామివారి ప్రసాదం అందించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. మహిళలు బొడ్డెమ్మలో పాల్గొనగా.. 15 ఏళ్లుగా నిర్వహిస్తున్న లడ్డూ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

గ్రామమంతా ఒక్కటై..

ఎక్లాస్‌పూర్‌లో కులమత భేదాలకు అతీతంగా ప్రతి కుటుంబం ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతోంది. పదో రోజు ఏకదంతుడిని పురవీధుల్లో ఊరేగించి నిమజ్జనం చేస్తారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామస్తులు సుఖసంతోషాలతో ఉండాలని గణనాథుడిని వేడుకుంటారు. ఉత్సవాల్లో భాగంగా దాదాపు 40 మంది విద్యార్థులు గణపతి దీక్ష మాలధరిస్తున్నారు. మండపం పరిశుభ్రత, పూజలు, విరాళాల సేకరణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో సేవలందిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు నియమ నిష్ఠలతో స్వామివారి సేవలో ఉంటున్నారు.

58 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో

వినాయక చవితి వేడుకలు

1968లో ఐదుగురితో

ప్రారంభమైన ఉత్సవాలు

40 మంది విద్యార్థుల గణపతి దీక్ష

కులమతాలకు అతీతంగా

గ్రామమంతా ఒక్కటై నిర్వహణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement