కొల్లాపూర్ రూరల్: మండలంలోని ఎల్లూరు గ్రామ శివారు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి లిఫ్టు మొదటి పంపు ద్వారా గురువారం అధికారులు నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఈ లోకిలాల్ మాట్లాడుతూ ప్యారామీటర్ చెక్ చేసుకోవడంలో భాగంగా 2 గంటలపాటు నీటిని విడుదల చేసి.. మరోసారి మోటార్‌ను చెక్ చేసుకున్నామని చెప్పారు. వచ్చే వారం నుంచి రిజర్వాయర్‌లోకి నీటిని నిరంతరాయంగా విడుదల చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


