పోషణలో జింక్ పాత్ర కీలకం..
● అంగన్‌వాడీ టీచర్లకు
అవగాహన కార్యక్రమం
మదనాపురం: చిన్నారుల్లో సూక్ష్మపోషకాల లోపాన్ని నివారించి, వారిలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు బయోఫోర్టిఫైడ్ (జీవ రసాయన పోషకాలు పెంచిన) వరి రకాలు ఎంతగానో దోహదపడతా యని వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. పోష ణ్ మాహ్ (పోషకాహార మాసం)ను పురస్కరించుకొని కృషి విజ్ఞాన కేంద్రం మదనాపురం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్ సంయుక్త నిర్వహణలో జింక్ సమృద్ధిగా ఉండే డీఆర్‌ఆర్, డీహెచ్‌ఏఎన్ 48, డీఆర్‌ఆర్, డీహెచ్‌ఏఎన్ 63 వరి రకాలపై అవగాహన, బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
ఫామ్ టు ఫుడ్ విధానమే మార్గం..
సీనీయర్ శాస్త్రవేత్త రాజేంద్రకుమార్ మాట్లాడుతూ.. రైతుస్థాయిలో నాణ్యమైన పోషకాలు కలిగిన పంటలను పండించి, వాటిని నేరుగా ఆహారంలో భాగంగా మార్చే విధానం అత్యంత ప్రాధాన్యమైందని తెలిపారు. వ్యవసాయం, ఆహారం, పోషకాహార భద్రతల మధ్య బలమైన అనుసంధానం ఏర్పడినప్పుడే వికసిత భారత్ సాధ్యమవుతుందని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా తల్లుల్లో పోషకాహార చైతన్యాన్ని పెంచాలని కోరారు.
90 రోజుల పైలెట్ ప్రాజెక్ట్..
హోమ్ సైన్‌న్స్ నిపుణురాలు డాక్టర్ అనిత మాట్లాడుతూ.. జిల్లాలోని 18 ఎంపిక చేసిన అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా దాదాపు 200 మంది ప్రీ స్కూల్ చిన్నారులకు 90 రోజుల పాటు రోజువారీ ఆహారంలో జింక్ బియ్యాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. దీని వల్ల పిల్లల్లో సూక్ష్మ పోషకాహార లోపాలు తొలగి, శారీరక పెరుగుదల మెరుగుపడుతుందన్నారు.
శాస్త్రవేత్తల బృందం (డా.సాయిప్రసాద్, డా. నీరజ, డా.అమ్తుల్‌వారిస్, డా.అరవింద్ కుమార్, డా.జ్యోతిబద్రి) మా ట్లాడుతూ.. శరీరంలో సాధారణ ఎదుగుదల, మానసిక వికాసం, వ్యాధి నిరోఽ దక శక్తి పెంపొందడానికి జింక్ అత్యంత కీలకమైన సూక్ష్మపోషకమని వివరించారు. సాధా రణ బియ్యంలో కంటే బయోఫోర్టిఫైడ్ రకాల్లో జింక్ శాతాన్ని శాసీ్త్రయంగా పెంచామని, రోజు వారీ సమతుల్య ఆహారంతో వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన సమాజం తయారవుతుందని పేర్కొన్నారు. అనంతరం 18 అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా జింక్ బియ్యం బస్తాలను అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో వన పర్తి జిల్లా సంక్షేమ అధికారిణి సుధారాణి, సీడీపీఓలు షేక్ సన్హేరా, రాజ్యలక్ష్మి, అమృతమ్మ, కేవీకే విస్తరణ అధికారులు, నిపుణురాలు డా. భవాని, అంగన్‌వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.


