అత్యవసరమైతే అవస్థలే! | - | Sakshi
Sakshi News home page

అత్యవసరమైతే అవస్థలే!

Sep 18 2026 2:15 AM | Updated on Sep 18 2026 2:15 AM

100 పడకలతో..

జనరల్‌ ఆస్పత్రిలో సరిపడా పడకలు లేక వైద్యం కోసం ఎదురుచూస్తున్న రోగులు

‘గద్వాల జిల్లాకు చెందిన బుడ్డమ్మ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో అక్కడి నుంచి ప్రైవేట్‌ అంబులెన్స్‌లో గురువారం జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ మెరుగైన చికిత్స పేరుతో స్థానిక వైద్యులు గాంధీ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. నిరుపేదలు అయిన బాధితులు గద్వాల నుంచి మహబూబ్‌నగర్‌కు రావడానికి రూ.3 వేలు, ఇక్కడి నుంచి హైదరాబాద్‌ చేరుకోవడానికి మరో రూ.3,500 అంబులెన్స్‌ కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది.

దేవరకద్ర మండల కేంద్రానికి చెందిన ఒక రైతుకు ఇటీవల పాముకాటుకు గురై చికిత్స కోసం జనరల్‌ ఆస్పత్రికి వచ్చారు. పరిస్థితి విష మంగా ఉండటంతో అత్యవసర సేవలు అందించాల్సి వచ్చింది. ఐసీయూ విభాగానికి తరలించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నం చేయగా అక్కడ బెడ్లు ఖాళీ లేకపోవడంతో తప్పని పరిస్థితిలో ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లారు.

ప్రస్తుతం ఐసీయూలో ఉన్న 30 పడకలకు 30 వెంటిలేటర్స్‌ అమర్చాం. అత్యవసర వైద్యానికి రోగుల సంఖ్య అధికంగా పెరిగింది. పడకలు ఏర్పాటు చేయడానికి ఉన్న వెంటిలేటర్స్‌ అందుబాటులో లేవు. కరోనా సమయంలో వచ్చిన వెంటిలేటర్స్‌ పని చేయడం లేదు. కొత్త భవనంలో 100 పడకల ఐసీయూ విభాగం ఏర్పాటు చేశాం. ఈ ఏడాది నవంబర్‌ నాటికి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.

– డాక్టర్‌ రంగా ఆజ్మీరా, సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement