మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ ఇంజినీరింగ్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 10, 11 తేదీల్లో 24 గంటల హ్యాకథాన్ నిర్వహించనున్నట్లు వీసీ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. విద్యార్థుల్లో సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలతో పాటు సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు బృందాలుగా పాల్గొనాలని, అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు, విజేతలకు బహుమతులు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, హెచ్‌ఓడీ తేజవర్దన్, అధ్యాపకులు పాల్గొన్నారు.
క్విజ్‌లో పాల్గొనాలి
విద్యార్థులు మైభారత్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుని నిర్వహించే క్విజ్ పోటీల్లో పాల్గొనాలని మైభారత్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ కోటానాయక్ సూచించారు. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల తో మాట్లాడిన ఆయన.. విజేతలకు ఢిల్లీలో ప్రధానిని కలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. క్వి జ్ ద్వారా క్రిటికల్ థింకింగ్, వికసిత్ భారత్ తదితర అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు.
అవార్డు గ్రహీతకు సన్మానం
రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డు అందుకున్న రాజ్‌కుమార్‌ను టీచింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, ఈశ్వర్‌కుమార్, కరుణాకర్‌రెడ్డి, బూమయ్య పాల్గొన్నారు.


