కోనేరులో పడి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

కోనేరులో పడి యువకుడి మృతి

Sep 8 2026 1:53 AM | Updated on Sep 8 2026 1:53 AM

భూత్పూర్‌(అడ్డాకుల): మండలంలోని కందూర్‌ శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం కోనేరులో పడి యువకుడు మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఎస్‌ ఐ, బంధువుల కథనం మేరకు.. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన సాయినాథ్‌రెడ్డి (31) ప్రైవే ట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో నుంచి కుటుంబ సభ్యులకు చెప్పకుండా, ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి మోటర్‌ సైకిల్‌పై అడ్డాకుల మండలంలోని కందూర్‌లో శ్రీరామలింగేశ్వర ఆలయం వద్దకు వచ్చాడు. రాత్రి ఆలయం వద్దకు వచ్చి ఫోన్‌ స్విచ్‌ ఆన్‌ చేసి సాయినాథ్‌రెడ్డి బావకు ఫోన్‌లో లోకేషన్‌ పెట్డాడు. ఉదయం లోకేషన్‌ ఆధారంగా భార్య రాజ్యల క్ష్మి, బంధువులు శ్రీరామలింగేశ్వర ఆలయం వద్దకు వచ్చారు. కోనేరు వద్ద చెప్పులు, మోటర్‌సైకిల్‌ క న్పించడంతో కోనేరులో కొద్ది సేపు వెతికారు. ఈ క్రమంలో కొనేరులోని ఓ చోట సాయినాథ్‌రెడ్డి మృతదేహాం కన్పించింది. బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ మురళీ పరిశీలించారు. అనంతరం సాయినాథ్‌రెడ్డి తల్లి సత్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement