ట్రాక్టర్‌ బోల్తా : డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా : డ్రైవర్‌ మృతి

Sep 8 2026 1:53 AM | Updated on Sep 8 2026 1:53 AM

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: వ రిమడిలో ట్రాక్టర్‌తో దు న్నుతూ ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తాపడి ఓనర్‌ కం డ్రైవర్‌ ఎద్దుల బాలస్వామి(45) మృతిచెందిన ఘటన సోమవారం మల్కాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్నకేశువులు తరిపొలం ట్రాక్టర్‌తో దున్నుతుండగా.. ఒక్కసారిగా ట్రాక్టర్‌ బోల్తాపడింది. ట్రాక్టర్‌పై ఉన్న డ్రైవర్‌ బాలస్వామి ట్రాక్టర్‌ కిందిబాగంలో పడి మృతిచెందాడు. ఈ ఘటనలో డ్రైవర్‌ అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.

బైక్‌ బోల్తా : నంద్యాల యువకుడి దుర్మరణం

అయిజ: బైక్‌ అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ యువ కుడు మృతిచెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై గురుస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన షైక్‌ ఆఫ్రికన్‌ (25) రాయచూరులోని శిల్ప ఫార్మా లైఫ్‌ లిమిటెడ్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. నంద్యాల నుంచి రాయచూరుకు బైక్‌పై వెళ్తుండగా భారత్‌మాల రోడ్డుపై బైక్‌ అదుపుతప్పి కిందపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

నెలరోజులు మృత్యువుతో పోరాడి

తనువు చాలించిన కాపరి

పాన్‌గల్‌: మండలంలోని కేతేపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి అన్నెరాములు(50) రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ కుర్మయ్య తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం అన్నె రాములు గత నెల 7న బైక్‌పై వెళ్తుండగా తెల్లరాళ్లపల్లి గ్రామ సమీపంలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్‌ ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఒక కాలును తొలగించారు. దాదాపుగా నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య నారమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు. అన్నెరాములు కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.

అప్పుల బాధతో

కౌలు రైతు ఆత్మహత్య

అలంపూర్‌ రూరల్‌: అప్పు ల బాధతో కౌలు రైతు ఆ త్మహత్యకు పాల్పడిన ఘ టన అలంపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఇమాంపురంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ పరుశురాము డు (39) మూడేళ్లుగా కౌలుకు పొలం సాగు చే స్తున్నాడు. పంటలు సరిగా పండక అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య లీలావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

లైంగికదాడి కేసులో ఇద్దరు మైనర్లకు రిమాండ్‌

గోపాల్‌పేట: వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు మైనర్‌ బాలురను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పరిశీలించిన అనంతరం ఇద్దరు మైనర్లను రిమాండ్‌ చేసినట్లు ఎస్సై శశిధర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement