నేతను కోల్పోయిన కుటుంబం.. తండ్రిని కోల్పోయిన పిల్లలు.. భర్తను కోల్పోయిన భార్య.. కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోయిన ఇళ్లు.. ఆ రోజు నారాయణపేటలో జరిగిన మారణకాండ వెనుక దాగి ఉన్న అసలు విషాదం ఇదే. మృతుల్లో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి (77), ఆయన తనయుడు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి (45), అప్పటి మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్(45), గన్‌మెన్ రాజారెడ్డి (42), ఎమ్మెల్యే డ్రైవర్ శ్రీనివాసులు (35), ఆర్డీఓ కార్యాలయ అటెండర్ సాయిబన్న (48), మాగనూర్ మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు లోకేశ్వర్‌రెడ్డి (26), ఊట్కూర్ మండలం తిప్రాస్‌పల్లి కాంగ్రెస్ నాయకుడు మోనప్పగౌడ్ (31), రవీందర్‌గౌడ్ (38) ఉన్నారు. గాయపడిన నారాయణపేటకు చెందిన దూడం విజయ్‌కుమార్, చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి డ్రైవర్ అరీఫ్ అనంతరం చికిత్సపొందుతూ మృతి చెందారు. తండ్రి.. కొడుకు.. ప్రభుత్వ అధికారి.. సిబ్బంది.. పార్టీ నాయకులు..ఒకే ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో 11 కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.


