● గుర్తు తెలియని వాహనం
ఢీకొట్టడంతో దుర్ఘటన
కడ్తాల్: శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముచ్చర్లగేట్ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వరప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన బొట్టే శివయాదవ్(24) హైదరాబాద్‌లోని జియాగూడ మార్కెట్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం వెల్దండ మండలం పెద్దాపూర్‌లోని బంధువుల ఇంట్లో జరిగిన బోనాల పండుగకు హాజరయ్యాడు. అదే రోజు రాత్రి తన ద్విచక్రవాహనంపై హైదరాబాద్ బయలుదేరగా.. మార్గమధ్యలో ముచ్చర్లగేట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్త గాయాలైన అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడి బావ నాగార్జున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వరప్రసాద్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీని కనుగొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
కడుపు నొప్పి
తాళలేక ఆత్మహత్య
మల్దకల్: అనారోగ్యంతో బాధపడుతూ ఓ వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘ టన మండలంలోని బిజ్వారంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇ లా ఉన్నాయి. గ్రామానికి చెందిన వడ్డె వెంకట న్న (58) పార్వతమ్మకు ఐదుగురు సంతానం. ఉన్న కొద్ది పాటి భూమిలో వ్యవసాయంతో పా టు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఇటీవల వెంకటన్నకు కడుపునొప్పి రా గా బాధతో పాటు ఆర్థిక ఇబ్బందులు మొదల య్యాయి. ఈ క్రమంలో మనస్థాపానికి గురై గురువారం రాత్రి పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమి త్తం గద్వాల ఆస్పత్రికి అక్కడి నుంచి కర్నూల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో
యువ రైతు మృతి
పెంట్లవెల్లి: మండలంలోని మంచాలకట్టకు చెందిన యువ రైతు చిన్నంబావి మండలంలోని కొప్పునూరు గ్రామంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మంచాలకట్టకు చెందిన సంఘమోని కృష్ణయ్య కుమారుడు సంఘమోని అశోక్ (24) చిన్నంబావి మండలంలోని కొప్పునూరులో 6 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్నాడు. మొక్కజొన్న పంట సాగు చేయగా.. పందుల బెడద ఎక్కువగా ఉండడంతో రోజువారి లాగే శుక్రవారం సాయంత్రం పొలం చుట్టు కరెంట్ షాక్ పెట్టాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అశోక్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు బాధితుడిని కొల్లాపూర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మూణ్ణాళ్ల ముచ్చటగానే ప్రేమ పెళ్లి
అశోక్ మంచాలకట్ట గ్రామానికి చెందిన యువతిని రెండేళ్లుగా ప్రేమించి ఈ ఏడాది ఫిబ్రవరిలో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. ఇంతలోనే అశోక్ మృతిచెందడంతో రెండు కుటుంబాలతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
జూరాల కుడి కాల్వలో మహిళ శవం లభ్యం
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధా న కుడి కాల్వ పక్కన ఉన్న పొదలో గుర్తు తెలి యని మహిళ శవం లభ్యమైనట్లు రేవులపల్లి పోలీసులు తెలిపారు. వివరాలు.. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో రేవులపల్లికి చెందిన లాజర్ గ్రామ శివారులోని కుడి కాల్వ పక్కన ఉన్న పొదలో ఓ శవం ఉన్నట్లు గుర్తించి, విషయాన్ని జీపీఓ వెంకట్రాములుకు తెలిపారు. దీంతో ఘటన స్థలానికి వెళ్లి కుళ్లిపోయిన శవాన్ని గుర్తించిన జీపీఓ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించగా.. 22 నుంచి 30 ఏళ్ల వయస్సు మధ్య గల గుర్తు తెలియని మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి, ముఖం కూడా గుర్తు పట్టలేని స్థితిలో ఉందన్నారు.
సమష్టి కృషితో
సెమినార్ విజయవంతం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సిబ్బంది సమష్టి కృషితో పీయూలో నిర్వహించిన సెమినార్ విజయవంతమైందని వీసీ శ్రీనివాస్ అన్నారు. సెమినార్ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కమిటీ సభ్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందిని అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, కన్వీనర్లు మధుసూదన్‌రెడ్డి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.


