డివైడర్‌ను ఢీకొని ప్రైవేట్‌ బస్సు బోల్తా | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొని ప్రైవేట్‌ బస్సు బోల్తా

Aug 15 2026 1:51 AM | Updated on Aug 15 2026 1:51 AM

8 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు

అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణం

ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ జానకి

భూత్పూర్‌: డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు మండల కేంద్రంలో జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టి, బోల్తా పడింది. ఎస్‌ఐ నాగన్న, ప్రయాణికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌ నుంచి రాత్రి 9 గంటలకు 35 మంది ప్రయాణికులతో అరుణాచలం బయలుదేరిన బస్సు 11:30 గంటల ప్రాంతంలో భోజనం చేసేందుకు జడ్చర్ల సమీపంలోని ఓ దాబా వద్ద ఆగింది. అనంతరం ప్రయాణం ప్రారంభించిన బస్సు భూత్పూర్‌ వద్ద పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా అతివేగంతో డివైడర్‌ను ఢీకొని బోల్తా పడి దాదాపు 15 మీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లి రోడ్డు పక్కనే ఇనుప లోడ్‌తో ఉన్న ట్రాలీని ఢీకొట్టి నిలిచిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న రమాదేవి, లక్ష్మీదుర్గ, సత్యవతి, లావణ్య, సాయితేజ, మహేశ్వరి, శరణప్ప, సంతోషిణికి తీవ్ర గాయాలు కాగా.. 4 వేర్వేరు అంబులెన్స్‌లో జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అజాగ్రత్త, అతివేగంగా బస్సు నడుపుతూ ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ రామాంజనేయులుపై ప్రయాణికురాలు రమాదేవి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగన్న తెలిపారు.

ఘటన స్ధలాన్ని పరిశీలించిన ఎస్పీ

ప్రమాదం విషయం తెలుసుకున్న ఎస్పీ జానకి ఘ టనాస్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణా లను సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ నాగన్నను అడిగి తెలు సుకున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలుసుకొని, వారికి అవసరమైన సాయం అందించాలని ఎస్పీ సూచించారు. భూత్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ముడావత్‌ బాలకోటి, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు లిక్కి న వీన్‌గౌడ్‌, సాయి ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ట్రా ఫిక్‌ క్లియర్‌ చేసేందుకు పోలీసులకు సహకరించారు.

3 కిలోమీటర్ల మేర..

బస్సు రోడ్డుపై బోల్తాపడటంతో కర్నూల్‌ వైపు వెళ్లే వాహనాలు 3 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, జేసీబీ, క్రేన్‌ సహాయంతో ట్రావెల్‌ బస్సును రోడ్డుపై నుంచి పక్కకు తరలించారు. దాదాపు గంట పాటు ట్రాఫిక్‌ స్తంభించింది.

డ్రైవర్‌తో ప్రయాణికుల వాగ్వాదం

జడ్చర్ల సమీపంలో దాబా వద్ద ఆగిన సమయంలో బస్సు వేగం తగ్గించి, జాగ్రత్తగా నడపాలని ప్రయాణికులు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచా రం. ఓ ప్రయాణికుడు భోజనం చేస్తుండగా.. వేగంగా తినాలని, ఇలా అయితే గమ్యం ఎప్పుడు చేరుకుంటామని డ్రైవర్‌ చెప్పడంతో ప్రయాణికుడు భోజ నం మధ్యలో వదిలేసి బస్సు ఎక్కాడు. ప్రమాదంలో సదరు ప్రయాణికుడి బంధువులకు తీవ్ర గా యాలు కావడంతో డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement