కొల్లాపూర్‌ వాసికి ఇండియన్‌ పోలీసు మెడల్‌ | - | Sakshi
Sakshi News home page

కొల్లాపూర్‌ వాసికి ఇండియన్‌ పోలీసు మెడల్‌

Aug 15 2026 1:51 AM | Updated on Aug 15 2026 1:51 AM

కొల్లాపూర్‌: విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు కొల్లాపూర్‌కు చెందిన సీఐ జగదీశ్వర్‌ ఇండియన్‌ పోలీసు మెడల్‌కు ఎంపికయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభు త్వం ప్రకటించిన పతకాలలో తెలంగాణ నుంచి ఆయనకు ఈ గౌరవం దక్కింది. ప్రస్తుతం సైబరాబాద్‌ కూకట్‌పల్లి క్రైమ్‌ విభాగంలో సీఐగా పనిచేస్తున్నారు. జగదీశ్వర్‌ 1990లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరారు. 2002లో ఆర్‌ఎస్‌ఐగా, 2004లో ఎస్‌ఐగా, 2012లో సీఐ గా బాధ్యతలు చేపట్టారు. కుషాయిగూడ, వనస్థలిపురం, మాదాపూర్‌, రామచంద్రాపురం, మై లార్‌దేవర్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మంచాల తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. పలు కీ లక కేసుల దర్యాప్తు బృందాల్లో సభ్యుడిగా పని చేశారు. తాను పనిచేసిన ప్రాంతాల్లో పోలీసు ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మార్గదర్శనం చేశారు. ఆయన వద్ద శిక్షణ పొందిన పలువురు ప్రస్తుతం పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం శౌర్య పతకం, సేవా పతకంతో పాటు తెలంగాణ ప్రభుత్వ సర్వోన్నత అవార్డును అందుకున్నారు. జగదీశ్వర్‌కు జాతీయ స్థాయి పతకం లభించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని జగదీశ్వర్‌ తెలిపారు.

బీఈడీ ప్రాక్టికల్స్‌

షెడ్యూల్‌ విడుదల

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూ పరిధిలో ని బీఈడీ కళాశాలల్లో డిజర్టేషన్‌ ప్రాక్టికల్‌ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఫేజ్‌–1లో 15 కళాశాలలకు ఈనెల 20న, ఫేజ్‌–2లో 14 కళాశాలలకు 22న పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధిత హార్డ్‌, సాఫ్ట్‌కాపీలను ఈనెల 17లోగా సమర్పించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement