రమణీయం.. చంద్రమౌలీశ్వరుడి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

రమణీయం.. చంద్రమౌలీశ్వరుడి రథోత్సవం

Aug 8 2026 12:47 AM | Updated on Aug 8 2026 12:47 AM

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మన్యంకొండ సమీపంలోని కోటకదిరలో శుక్రవారం సద్గురు చంద్రమౌలీశ్వర పురుషోత్తమానంద సరస్వతి స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివా రి సప్తాహ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా పవిత్ర కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. రకరకాల పూలతో రథాన్ని శోభయమానంగా అలంకరించారు. స్వామివారి రథాన్ని లాగ డానికి భక్తులు పోటీపడ్డారు. రథానికి అడుగడుగునా భక్తులు పూజలు చేసి స్వాగతం పలికారు. రథంపై స్వామివారు ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. రథోత్సవ అనంతరం స్వామివారి పల్లకీసేవను నిర్వహించారు. స్వామివారిని ముడా చైర్మ న్‌ లక్ష్మణ్‌యాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహారెడ్డి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూ టీ మేయర్‌ సురేందర్‌రెడ్డి ఆలయ ధర్మకర్త శ్రీధర్‌శర్మ, పలువురు నాయకులు స్వామివారిని దర్శించుకుని తరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement