స్టేషన్ మహబూబ్‌నగర్: గణేష్ ఉత్సవాలను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వైభవంగా నిర్వహించుకుందామని గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు అన్నారు. జిల్లాకేంద్రంలోని గణేష్ భవన్‌లో ఆదివారం సమితి అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి ఆధ్వర్యంలో వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. వచ్చేనెల 14వ తేదీన వినాయక చవితి ప్రతిష్టాపన కార్యక్రమాల గురించి చర్చించారు. తొమ్మిది రోజుల పాటు వినాయక ఉత్సవాలు ఉంటాయన్నారు. నిమజ్జనం రోజు వినాయకుల ఊరేగింపుతో వచ్చే నెల 23వ తేదీన రాత్రి 8 గంటలకు గడియారం చౌరస్తా వరకు చేరుకోవాలని సూచించారు. దీంతో ప్రజలు శోభాయాత్రను తిలకించడానికి అవకాశం లభిస్తుందన్నారు. సమావేశంలో సమితి గౌరవాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, కార్యదర్శి బాలయ్య, సహాయ కార్యదర్శి లక్ష్మణ్, విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షుడు రెబ్బ విఘ్నేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రాములు, మాల్యాద్రిరెడ్డి, సురేందర్‌రెడ్డి, అంజయ్య, సుదర్శన్, హనుమంతు, శ్రీధర్, శ్రీశైలం, నిరంజన్ పాల్గొన్నారు.


