రైతుకు వాత! | - | Sakshi
Sakshi News home page

రైతుకు వాత!

Aug 24 2026 12:43 AM | Updated on Aug 24 2026 12:43 AM

4.05 లక్షల ఎకరాల్లో సాగు అంచనా

న్యూస్‌రీల్‌

నీటి వినియోగంపై అప్రమత్తత

మహబూబ్‌నగర్‌
ఎరువుల మోత..

సోమవారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2026

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): ఆలస్యమైనా వానాకాలం సాగు ఊపందుకుంది. వర్షాలు కురుస్తుండటంతో రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు. అయితే ఎల్‌నినో ప్రభావంతో వర్షాల తీరు, ఉష్ణోగ్రతల్లో మార్పులు సాగుపై ప్రభావం చూపుతుండగా.. మరోవైపు పెరిగిన ఎరువుల ధరలు రైతులకు అదనపు భారంగా మారాయి. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరగడంతోపాటు యూరియా రవాణా చార్జీలను కూడా రైతులపైనే మోపడంతో ఎకరా సాగు పెట్టుబడి పెరుగుతోంది.

జిల్లాలో ఈ వానాకాలంలో 4,05,236 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు 2,39,794 ఎకరాల్లో సాగు ప్రారంభమైంది. ప్రధానంగా వరి, పత్తి సాగు ఎక్కువగా ఉంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 2.40 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 1,13,119 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. పత్తి లక్ష్యం 95 వేల ఎకరాలు కాగా 88,500 ఎకరాల్లో సాగైంది. కంది మాత్రం అంచనాను మించి 13,923 ఎకరాల్లో సాగైంది.

యూరియా రవాణా చార్జీలు రైతులపైనే

బస్తాపై రూ.50 వరకు అదనపు భారం

కాంప్లెక్స్‌ ఎరువుల బస్తాపై ఏకంగా రూ.700 పెంపు

జిల్లాకు 1.25 లక్షల టన్నుల ఎరువులు అవసరం

ఎల్‌నినో ప్రభావంతో ఆలస్యంగా మొదలైన వరి నాట్లు

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోతే వరి సాగుపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే నాట్లు వేసిన పొలాల్లో అవసరానికి మించి నీరు వినియోగించకుండా క్రమబద్ధీకరించాలి. వర్షపు నీటిని పొలాల్లో నిల్వ చేసుకోవడం, తేమను సంరక్షించడం, ప్రత్యామ్నాయ నీటి వనరులను సిద్ధంగా ఉంచుకోవడం ద్వారా పంటలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement