కేంద్రంలో నిరంకుశ పాలన: సీపీఎం | - | Sakshi
Sakshi News home page

కేంద్రంలో నిరంకుశ పాలన: సీపీఎం

Aug 24 2026 12:43 AM | Updated on Aug 24 2026 12:43 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: దేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి.సాగర్‌ విమర్శించారు. జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆదివారం ఆయన మాట్లాడారు. అయోధ్యలో రాంమందిర్‌ పేరుతో రూ.కోట్లలో స్కామ్‌ జరిగినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో ప్రతిపక్షాల ఓట్లను తొలగించేందుకు యత్నిస్తోందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక యువతను మోసం చేసిందన్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రాములు మాట్లాడుతూ గ్రామస్థాయిలో వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారానికి తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో నల్లవెల్లి కురుమూర్తి, చంద్రకాంత్‌, దీప్లానాయక్‌, వేణు, పద్మ, రాజ్‌కుమార్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement