ఇప్పటికే విత్తనాలు, కూలీలు, పురుగు మందులు, డీజిల్ ఖర్చులు పెరిగిపోయాయి. ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా పెరగడంతో ఎకరాకు పెట్టుబడి మరింత పెరుగుతోంది. పంట దిగుబడికి తగిన ధర రాకపోతే రైతుకు మిగిలేది నష్టమే. అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తున్నాం. రవాణా చార్జీలు మోపడం అన్యాయం. ప్రభుత్వం ఎరువుల ధరల పెంపును నియంత్రించాలి.
– భీమయ్య, రైతు, మాచన్‌పల్లి గ్రామం, మహబూబ్‌నగర్ రూరల్
సరైన నిర్ణయం కాదు..
పంటల సాగులో ఎరువుల వినియోగమే ఎక్కువ. ఒక్కో బస్తాపై రూ.వందల్లో పెరిగితే నాలుగైదు బస్తాలకు కలిపి రూ.వేలు అవుతుంది. రైతులపై ఈ అదనపు భారం పడకుండా ఎరువులను పాత ధరలకే అందించాలి. అలాగే ట్రాన్స్‌పోర్ట్ చార్జీలను రైతుల నుంచి వసూలు చేయడం కూడా సరైన నిర్ణయం కాదు.
– చంద్రయ్య, రైతు, పర్దీపూర్ గ్రామం,
చిన్నచింతకుంట మండలం
రద్దు చేశారు..
ఎరువుల బస్తాల రవాణా చార్జీలను గతంలో ప్రభుత్వమే చెల్లించేది. జూలై 15 కన్నా ముందు రవాణా ఖర్చులు మార్క్‌ఫెడ్ శాఖ భరించేది. కాగా ఇటీవల ప్రభుత్వం రవాణా సౌకర్యాన్ని రద్దు చేసినట్లు జీఓ విడుదల చేసింది. ఇక నుంచి దూరాన్ని బట్టి చార్జీలు అమలవుతాయి. – గోవింద్‌నాయక్,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
●


