స్టేషన్ మహబూబ్‌నగర్: తెలంగాణ సాహితీ దిగ్గజం ఆచార్య పాకాల యశోదారెడ్డి జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు ఆధ్వర్యంలో ఈనెల 9, 10 తేదీల్లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆచార్య పాకాల యశోదారెడ్డి సమగ్ర సాహిత్యం సమాలోచనం రెండురోజులపాటు రాష్ట్రస్థాయి సదస్సు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి, విశ్రాంత ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి, పాకాల లక్ష్మీరెడ్డి, ఓయూ తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య మసన చెన్నప్ప, ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య పులికొండ సుబ్బాచారి, నాళేశ్వరం శంకరం, ఇతర సాహితీవేత్తలు హాజరుకానున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయులు
నిరంతర విద్యార్థి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు జిల్లా కేంద్రంలోని మాడల్ బేసిక్ పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాన్ని ఆర్జేడీ సోమిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యా యులు నిరంతర విద్యార్థిగా ఉంటూ కొత్త విషయాలను తెలుసుకుని విద్యార్థులకు బోధించాలని సూచించారు. శిక్షణలో తెలుసుకున్న అంశాలను తప్పకుండా తరగతి గదిలో అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, పాల్గొన్నారు.
ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్‌కు 8వ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ విజయకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 24వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, నవంబర్ 11న అర్హత పరీక్ష ఉంటుదని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం పాఠశాలల హెచ్‌ఎంలను సంప్రదించాలని సూచించారు.


