నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు

Aug 7 2026 1:56 AM | Updated on Aug 7 2026 1:56 AM

రూ.68 వేల నకిలీ నోట్లు స్వాధీనం

ఏడుగురు నిందితులు అరెస్టు, ఒకరు పరారీ

వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్‌

కందనూలు: బిజినేపల్లి మండలంలో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు గురువారం పట్టుకున్నారు. బిజినేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 1న మంగనూర్‌ గ్రామంలోని కనకదుర్గ వైన్స్‌లో ఒక వ్యక్తి మద్యం కొనడానికి వచ్చి రెండు రూ.500 నోట్లు ఇచ్చాడు. క్యాషియర్‌ ఆ నోట్లను మిషిన్‌లో వేసి కౌంటింగ్‌ చేస్తుండగా అవి నకిలీవని తేలాయి. వైన్స్‌ షాపు నిర్వాహకుడు రాగి స్వామి బిజినేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది మంగనూరులో బొల్ల కురుమూర్తి ఇంట్లో దాడులు చేయగా.. ఏడుగురు వ్యక్తులు నకిలీ నోట్లు ము ద్రిస్తూ దొరికిపోయారు. ఏ1 కలిదిండి నాగరాజు (సిద్ధాపురం, పశ్చిమగోదావరి), ఏ2 శివవెంకటధర్మరాజు (కలువపూడి, పశ్చిమగోదావరి), ఏ3 అశోక్‌కుమార్‌ (సిద్ధాపురం, పశ్చిమగోదావరి), ఏ4 ఎల్‌.ఎన్‌ సతీష్‌కుమార్‌ (తడికలపూడి, ఏలూరు), ఏ5 వంగా నవీన్‌గౌడ్‌ (మంగనూర్‌, బిజినేపల్లి), ఏ6 బొల్ల కురుమూర్తి (మంగనూరు, బిజినేపల్లి), ఏ7 పృథ్వీరాజ్‌ (చింతలపూడి, ఏ లూరు), ఏ8 జయమంగళ సత్యనారా యణ (కై క లూరు, కృష్ణ జిల్లా), ఏ8 పరారీలో ఉన్నారు. నిందితులు 8 మంది కలిసి కలర్‌ జిరా క్స్‌ యంత్రాల ద్వారా రూ.2 లక్షల విలువైన నకి లీ నోట్లను ముద్రించారు. నకిలీ నోట్లను స్థానిక దాబాలు, పెట్రోల్‌ బంక్‌లు, కిరాణాషాపుల్లో చలామణి చే శారు. నిందితుల నుంచి రూ. 68 వేల విలువ గ ల నకిలీ రూ.500 నోట్లు, 7 మొబై ల్‌ ఫోన్లు, ఒక కలర్‌ జిరాక్స్‌ మిషన్‌, కౌంటింగ్‌ మిషన్‌, ప్రింట్‌ చేసిన నకిలీ పేపర్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. నకిలీ నో ట్ల తయారీ, చెలామణికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉ న్నా పోలీసులకు సమాచారం అందించాలని కో రారు. సమావేశంలో ఎస్‌ఐ ఎస్‌కే శంషోద్దీన్‌, సిబ్బంది భీముడు, ప్రవీణ్‌, రమేష్‌, శివ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement