● యువకుడిని అదుపులోకి తీసుకున్న
పోలీసులు
మహబూబ్‌నగర్ క్రైం: పాలమూరులో గంజాయి కలకలం రేపింది. గంజాయికి బానిస అయిన యువకుడిని పోలీసులు పట్టుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. దీనికి సబంధించిన వివరాలను టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఇజాజుద్దీన్ వెల్లడించారు. టూటౌన్ ఎస్‌ఐ శివ నాగేశ్వర్ బృందం సివిల్ దుస్తుల్లో ఉదయం సంజన్‌నగర్ ఏరియాలో తనిఖీలు చేపట్టారు. దేవరకద్రకు చెందిన యువకుడు బోయ కరుణాకర్ గంజాయి తాగినట్లు గుర్తించారు. నిందితుడు బోయ కరుణాకర్ అలియాస్ రాజు ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఆరు నెలల నుంచి హైదరాబాద్ దూల్‌పేట ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసి మహబూబ్‌నగర్‌కు తీసుకువచ్చి తాగుతున్నట్లు తేలిందని వివరించారు. డ్రగ్ టెస్టింగ్ కిట్ ద్వారా పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.
గంజాయి విక్రేత అరెస్ట్
కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి గ్రా మ శివారులో భీమా ఫేజ్–2 కాల్వసమీపంలో గంజాయి విక్రయిస్తున్న వనపర్తి పట్టణానికి చెందిన బంగారు భరత్ కుమార్(39)ను, గంజాయి కొనుగోలు చేస్తున్న కానాయపల్లి గ్రామానికి చెందిన జనుంపల్లి పవన్ (25), ఇనుపునూరి గణేష్ (25)లను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం కొత్తకోట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రాంబాబు వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి సుమారు రూ.1,500 విలువ చేసే 7 గ్రాముల గంజాయి, రెండు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకునట్లు తెలిపారు. వారిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎస్‌ఐ ఎం.విక్రమ్, ఏఎస్‌ఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు.


