పీయూ లా కళాశాలలో ప్రవేశాలు | - | Sakshi
Sakshi News home page

పీయూ లా కళాశాలలో ప్రవేశాలు

Aug 7 2026 1:56 AM | Updated on Aug 7 2026 1:56 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఇటీవలి జరిగిన లా సెట్‌లో ర్యాంకులు పొందిన విద్యార్థులకు పీయూ లా కళాశాలలో చేరేందుకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు పలువురు విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ భూమయ్య మాట్లాడుతూ ప్రవేశాల కోసం వచ్చే విద్యార్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో రావాలని, టీసీ, బోనోఫైడ్‌, కులం, ఆదాయం, ఆధార్‌, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆడిట్‌ సెల్‌ కోఆర్డినేటర్‌ రవికుమార్‌, సిద్దరామగౌడ్‌, సాయిప్రసాద్‌, కిరష్‌, జగదీష్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర సంఘంలో ఉమ్మడి జిల్లా అర్చకులకు చోటు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర ధూ ప, దీప నైవేద్య వీరశైవ జంగమ అర్చక సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీలో ఉమ్మడి మహ బూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పలువురు అర్చకులకు చోటు లభించింది. భువనగిరి జిల్లా కొలనుపాకలో జరిగిన మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా మడపతి బుచ్చిలింగం, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మల్లేష్‌స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సురేష్‌కుమార్‌ శాసీ్త్ర ఎన్నికయ్యారు. అదే విధంగా కార్యవర్గ సభ్యులుగా బాలలింగయ్య, చక్రిస్వామి, శ్రీకాంత్‌, పరమేశ్వరయ్య, నాగరాజు స్వామి, సునీల్‌ స్వామి, విశ్వనాథ్‌ స్వామిలకు అవకాశం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement