న్యూస్‌రీల్
జిల్లా జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత
సంప్రదాయానికి నవ్యకళ
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది.
చెడుగుడు ఆడేస్తున్నారు..!
గ్రామీణ క్రీడ కబడ్డీలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాలమూరు క్రీడాకారులు ప్రతిభ చాటుతున్నారు.
శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026
–8లో u
నేడు, రేపు పీయూ
జాతీయ సదస్సు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ ఆధ్వర్యంలో గురువారం షాద్‌నగర్ సమీపంలోని కన్హా శాంతివనంలో జాతీయసదస్సు ప్రారంభం కానుంది. ఈమేరకు శాంతివనంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. రెండురోజులు నిర్వహించనున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల నుంచి వీసీలు, రిజిస్ట్రార్లు, ఇతర ప్రముఖులు మొత్తం 600 మంది అతిథులుగా హాజరుకానున్నారు. మొదటి రోజు ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనరసింహ హాజరుకాన్నారు. ముగింపు వేడుకలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రానున్నారు. కాగా.. రెండోరోజు ఉదయం 10 గంటలకు పీయూకు ఉషా, మేరు ప్రతినిధులు రానున్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో
పతకాలు సాధించాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని అథ్లెటిక్స్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శరత్‌చంద్ర సూచించారు. హన్మకొండలో శుక్రవారం, శనివారాల్లో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా అండర్–6, 8, 10, 12 ఏళ్ల బాలబాలికలు, కిడ్స్, జాతీయ జావెలిన్ డే సందర్భంగా అండర్–14, 16, 18, 20 బాలబాలికలు, పురుషుల, మహిళల జావెలిన్‌త్రో పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను అభినందించారు. కోచ్‌లు ఆనంద్, సునీల్‌కుమార్, సభ్యులు శ్రీనివాసులు, దత్తాత్రేయ పాల్గొన్నారు.
స్వాతంత్య్ర వేడుకలు
ఘనంగా నిర్వహిద్దాం
మహబూబ్‌నగర్ క్రైం: స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించే జిల్లా పరేడ్ గ్రౌండ్‌ను గురువారం కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ డి.జానకి పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్‌లో వేయాల్సిన టెంట్లు, వీఐపీ సీట్టింగ్, ప్రధాన వేదిక, అధికారులు, ప్రజాప్రతినిధుల సీట్టింగ్ ఏర్పాట్లు, పరేడ్ నిర్వహణ విధానం, శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటుపై చర్చించారు. ఈసారి మరింత మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలని, వర్షం నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు. ఆర్‌డీఓ నవీన్, కమిషనర్ రామానుజులరెడ్డి పాల్గొన్నారు.
ఉద్యోగుల పెండింగ్
సమస్యలు పరిష్కరిచాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉద్యోగుల పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ రాజీవ్‌రెడ్డి కోరారు. గురువారం కలెక్టర్ ఖుష్బూగుప్తాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వివిధస్థాయిలో ఉద్యోగుల ప్రమోషన్ల లెక్క తేల్చి వెంటనే అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని కోరారు. కారుణ్య నియమకాల గు రించి చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని వెంటనే వాటిని పరిష్కరించాలన్నారు. మెడికల్ గ్రౌండ్ కింది స్వచ్ఛంద పదవి విరమణ తీసుకునే ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని కోరారు. అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ హరిప్రియ, టీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి చంద్రనాయక్, అసోసియేట్ అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి, దేవేందర్, కృష్ణమోహన్ పాల్గొన్నారు.
నేటి నుంచి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో శుక్రవారం నుంచి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి మహబూబ్‌గర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.మన్‌మోహన్‌రావు, వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయని.. ఈ పోటీల్లో ఇదివరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పాల్గొన్న క్రీడాకారులు సైతం పాల్గొంటారని పేర్కొన్నారు.
ఐదు రాస్తే..
జనరల్ మెడిసిన్ కేంద్రం వద్ద వేచి ఉన్న రోగులు
రెండే ఇస్తారు!
ఇక్కడ కనిపిస్తున్న అతడి పేరు రమేశ్. అతడు చర్మ సమస్యలతో జిల్లా జనరల్ ఆస్పత్రికి వచ్చారు. ఓపీ తీసుకుని వైద్యుడి దగ్గరికి వెళ్తే.. ఐదు రకాల మందులు, ఒక అయింట్‌మెంట్ రాయడం జరిగింది. వాటిలో రెండు రకాల మందులతో పాటు అయింట్‌మెంట్ లేదని చెప్పడంతో జనరిక్ దుకాణంలో అయిట్‌మెంట్, మిగతా మందులను బయట కొనుగోలు చేశారు.
పాలమూరు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు వికారాబాద్‌కు చెందిన పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పేరుకు మాత్రం 650 పడకలతో సేవలు అందిస్తున్నారే తప్ప.. అరకొర వసతులతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా రోగులకు కావాల్సిన మందులు లేక నిత్యం అవస్థలు పడుతున్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతుంది. వాతావరణలో వస్తున్న మార్పుల కారణంగా జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో నిత్యం ఆస్పత్రిలో 1500 నుంచి 1700 మంది వరకు వస్తున్నారు. అదేవిధంగా 150 నుంచి 200 మంది ఆడ్మిట్ అవుతున్నారు. అయితే వైద్యులు రాసే మందుల్లో కొన్ని రకాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. మిగతా వాటిని బయట తీసుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారు. కొందరు చేసేదిలేక ప్రైవేటులో మందులను కొనుగోలు చేస్తుండగా.. నిరుపేదలు ఇచ్చిన అరకొర మందులు తీసుకొని వెళ్లిపోతున్నారు.
వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన రాఘవేందర్ ముక్కులో కండ పెరగడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ సర్జరీ చేయాలని చెప్పడంతో రెండు వారాల నుంచి జిల్లా జనరల్ ఆస్పత్రికి తిరుగుతున్నాడు. ఈఎన్‌టీ విభాగంలో కేవలం మందులు రాసి పంపుతున్నారని.. అవి కూడా ఇక్కడ దొరకడం లేదని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముక్కులో కొట్టుకోవడానికి అవసరమైన స్ప్రే, మందుల కోసం రూ.2 వేల వరకు ఖర్చవుతుందని వాపోతున్నారు.
ఆస్పత్రిలో రోజువారి ఓపీలో 20 శాతం మంది గ్యాస్ట్రిక్ సమస్యతో వస్తున్నారు. సంబంధిత వైద్యుడు రాసిచ్చే మందుల కోసం కౌంటర్ వద్దకు వెళ్తే కనీసం ఒక్క రకం ట్యాబ్‌లెట్లు, సిరాప్‌లు కానీ అందుబాటులో ఉండటం లేదు. ఇక బీపీలో కేవలం రెండు రకాలు మాత్రమే ఉండగా.. అవి రోగులకు ఉపయోగకరంగా ఉండటం లేదు. బీపీ రోగుల పరిస్థితి మేరకు వైద్యులు కాంబినేషన్‌లో మందులు రాస్తుంటారు. అలాంటి మందులు కూడా ఆస్పత్రిలో ఉండటం లేదు. షుగర్‌కు సంబంధించి కేవలం రెండు రకాల ట్యాబ్‌లెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇన్సూలిన్ అయితే ఇక అడుగొద్దని చెబుతున్నారు. ప్రధానంగా చర్మ వ్యాధులకు సంబంధించి ఎలాంటి ట్యాబ్‌లెట్లు కానీ, అయింట్‌మెంట్లుకానీ ఉండటం లేదు. మానసిక వైద్యానికి మందులు రాస్తే.. నేరుగా ప్రైవేటు మెడికల్ దుకాణాలకే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
కొరత లేకుండా చర్యలు..
జనరల్ ఆస్పత్రిలో కొన్ని రకాల మందులు ఉండటం లేదు. ఈ విషయంపై వారం క్రితం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో డీఎంఈ, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అవసరమైన మందుల కోసం ఇండెంట్ కూడా పెట్టాం. సర్జరీ సమయంలో, గర్భిణులకు ఇచ్చే వాటితో పాటు అత్యవసరమైన వాటిని బయట కొనుగోలు చేస్తున్నాం. రెగ్యులర్‌గా ఓపీలో ఇచ్చే ట్యాబ్‌లెట్స్, ఇతర డ్రగ్స్‌ను తీసుకోవడం లేదు.
– డా.రంగా ఆజ్మీరా,
జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్
గద్వాల చీరకు చెదరని ఆదరణ
గద్వాల నేత చీరలు దేశ, విదేశి వనితల ఆదరణ పొందుతూ నేటికి ప్రత్యేకతను చాటుతుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వివాహాది శుభకరార్యాల సందర్భంగా మహిళలు చీరలు కొనుగోలు చేసేందుకు ఇక్కడికే వస్తున్నారు. గద్వాల సంస్థానం ఏర్పడినప్పటి నుంచి నాలుగు శతాబ్దాలుగా కాలానుగుణంగా ప్రత్యేకత ఉండేలా ఆధునిక సాంకేతికతను జోడిస్తూ ఇక్కడి నేతన్నలు చీరలను సిద్ధం చేస్తున్నారు. కాటన్ చీరకు అంచు, కొంగు బార్డర్‌లో గద్వాల వారసత్వంగా వస్తున్న డిజైన్లను కొనసాగిస్తున్నారు. ఒక్కో చీర రూ.1,000 నుంచి రూ.2 లక్షల వరకు పలుకుతాయి. నడిగడ్డ ప్రాంతంలో దాదాపు 6 వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి బతుకుతున్నారు. గద్వాల జరీ చీరలకు 2008లోనే భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ పేటెంట్) లభించింది. ప్రతి ఏటా దసరా బ్రహ్మోత్సవాల్లో తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు గద్వాల నుంచే వెళతాయి.
నాణ్యత, మన్నికకు కేరాఫ్ అమరచింత
అమరచింతలో తయారుచేసిన చీరలను గద్వాల, హైదరాబాద్‌కు చెందిన మాస్టర్ వీవర్స్ కొనుగోలు చేసి.. వారివారి బ్రాండ్ పేర్లతో విక్రయిస్తున్నారు. నాణ్యతతో పాటు మన్నిక కూడా బాగుండడంతో వ్యాపారులు ప్రత్యేకంగా ఇక్కడ చీరలను తయారు చేయిస్తున్నారు. 2019లో 20 మందితో అమరచింత చేనేత ఉత్పత్తిదారుల సంఘం ప్రారంభమైంంది. దీంతో ఒక్కొక్కరుగా కార్మికులు ముందుకొచ్చి సంఘంలో సభ్యత్వం పొంది భాగస్వాములయ్యారు. ప్రస్తుతం సంఘంలో 550 మంది సభ్యులున్నారు. 2021లో 10 మగ్గాలతో ప్రారంభమైన సంఘం ప్రస్తుతం 130 మగ్గాలతో కొనసాగుతోంది. పట్టణంలోని ప్రతి కార్మికుడి ఇంటికి మగ్గం ఇవ్వడం.. వారు తయారు చేసిన చీరలు సేకరించి విక్రయించడం వంటి కార్యక్రమాలతో నిర్వహణ విజయవంతంగా కొనసాగుతోంది. మూడేళ్లలో సంఘం ద్వా రా చేనేత వస్త్రాల తయారీ, అమ్మకాలతో రూ.2.50 కోట్ల వ్యాపారం జరిగింది.
ఆన్‌లైన్‌లో రాజోళి చీరలు
సాధారణ నూలుతో పట్టుచీరలు నేసే చేనేత కార్మికులకు రాజోళి పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందింది. మీనా టర్నింగ్, కోటకొమ్మ, పైతాన్, కుట్టు, బ్రోకెచ్ లాంటి చీరు ఇక్కడ తయారు చేస్తారు. ముఖ్యంగా మీనా టర్నింగ్ చీర ఒక రంగులో ఉంటే.. దానిపై వచ్చే పక్షి బొమ్మలు మరో రంగులో ఉంటాయి. పక్షి కన్ను మరో రంగులో ఉండేలా డిజైన్ చేస్తారు. ఈ చీరలకు ఆన్‌లైన్‌లో మంచి గిరాకీ ఉంటుంది.
ఖాళీగా 194 పోస్టులు..
జనరల్ ఆస్పత్రిలోని 22 విభాగాల్లో మొత్తం 340 పోస్టులకు గాను ప్రస్తుతం 138 మంది విధుల్లో ఉన్నారు. 194 పోస్టులు ఖాళీ ఉండటంతో రోగులకు మెరుగైన సేవలు అందడం లేదు. ఇటీవల 15 మంది బదిలీ కాగా.. 12 మంది మాత్రమే విధుల్లో చేరారు. ఇక టెక్నీకల్ విభాగంతో పాటు నర్సింగ్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్ విభాగాల్లో ఖాళీల కొరత వేధిస్తోంది. దీనికి తోడు ఉన్న వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, కొందరు నిత్యం హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించడం కూడా సమస్యగా మారింది.
గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్, చర్మ సమస్యలకు బయటి మందులే దిక్కు
ఇంజక్షన్లు సైతం లేక రోగుల అవస్థలు
ఇప్పటికే వైద్యుల కొరత..ఉన్నవారు సైతం సమయానికి రారు
పర్యవేక్షణ కరువు.. పట్టించుకోని ఉన్నతాధికారులు
కాలానుగుణంగా ప్రత్యేకత చాటుతున్న ‘చేనేత’ కార్మికులు
సాధారణ నూలుతోనే అద్భుతమైన డిజైన్ల సృష్టి
చూడగానే ఆకర్షించేలా విభిన్నమైన చీరలు నేయడంలో దిట్ట
తిరుమల శ్రీనివాసుడికి ఎరువాడ పంచె అందిస్తున్న గద్వాల చేనేతలు
సంప్రదాయానికి ఆధునికత జోడిస్తూ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు


