శ్రీశైలం వైపు వరద నీరు
గద్వాల/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో విద్యుదుత్పత్తి తగ్గు ముఖం పట్టింది. బుధవారం ఎగువ విద్యుత్‌కేంద్రంలోని ఆరు యూనిట్ల ద్వారా 234 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. దిగువ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టలేదు. ఇప్పటి వరకు ఎగువలో 29.246 ఎంయూ, దిగువలో 25.716 మిలియన్ యూనిట్ల వి ద్యుదుత్పత్తిని చేశారు. ఇన్‌ఫ్లో రూపంలో 2,45, 000క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతుంది. 33 గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 218790, విద్యుదుత్పత్తి ద్వారా 26,208 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టుకు 750 క్యూసెక్కులు, భీమా–1కు 1300, భీమా–2కు 872 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 630 క్యూసెక్కులు, ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు 820 క్యూసెక్కులు, ప్రధాన కుడి కాల్వకు 675 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 535 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.


