రాయపల్లి శివారులో జార్ఖండ్‌ వాసి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

రాయపల్లి శివారులో జార్ఖండ్‌ వాసి ఆత్మహత్య

Aug 6 2026 12:57 AM | Updated on Aug 6 2026 12:57 AM

రాజాపూర్‌: పనిచేసే చోటే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం రాజాపూర్‌ మండల పరిధిలోని రంయపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్‌ రాష్ట్రం చంద్రపురబుకారో జిల్లా ధావాతండ్‌ పరభాని గ్రామానికి చెందిన తులసి రాజ్‌వార్‌ (35) రాయపల్లి శివారులోగల అక్షయకల్ప అనే పరిశ్రమలో గల డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే బుధవారం ఇంటి తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో పాటు క్యాంటీన్‌లో టిఫిన్‌కు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి కార్మికులు తలుపులు గట్టిగా తోయడంతో తెరుచుకున్నాయి. అప్పటికే పైకప్పు రాడ్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్‌ఐ లక్ష్మయ్య వివరాలు సేకరించి మృతదేహాన్ని కిందకు దించారు. అయితే రాజ్‌వార్‌ మంగళవారం రాత్రి మృతి చెందిన విషయాన్ని పరిశ్రమ యాజమాన్యం కప్పి పుచ్చడంతో పాటు గ్రామ సర్పంచ్‌ గాయిత్రి మల్లేష్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ ప్రవీన్‌గౌడ్‌తో పాటు గ్రామస్తులు పరిశ్రమ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత మృతదేహాన్ని పరిశ్రమ గేటుముందు ఉంచి నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీసుల జోక్యంతో మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని వారు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యప్తు జరుపుతామని ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement