● క్రీడాకారుడిగా, కోచ్‌గా
విక్రం ఆదిత్యరెడ్డి ప్రతిభ
● ఏషియన్ నెట్‌బాల్‌లో పాల్గొనే భారత మహిళా జట్టుకు కోచ్‌గా నియామకం
మహబూబ్‌నగర్ క్రీడలు: తాను ఇష్టపడిన క్రీడ పట్ల ఆసక్తి కనబరుస్తూ ఒక క్రీడాకారుడిగా రాణించడంతో పాటు కోచ్‌గా సేవలు అందిస్తున్నారు జిల్లాలోని హన్వాడకు చెందిన విక్రమ్ ఆదిత్యరెడ్డి. ఈయన 2003లో నెట్‌బాల్ ప్రయాణాన్ని ప్రారంభించారు. 2004 హైదరాబాద్‌లో నిర్వహించిన సబ్ జూనియర్ జాతీయ చాంపియన్‌షిప్‌లో మొదటి జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు. అప్పటి నుంచి దాదాపు 35 జాతీయస్థాయి టోర్నమెంట్‌లలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. అలాగే భారత మహిళా జట్లకు పలుసార్లు అసిస్టెంట్ కోచ్‌గా సేవలు అందించడం విశేషం. కోచ్‌గా క్వాలిఫై కావడానికి సింగపూర్‌లో ఏషియన్ కోచింగ్ కోర్సును పూర్తి చేసి లెవల్–3 కోచ్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఇప్పటివరకు నాలుగుసార్లు అంతర్జాతీయ నెట్‌బాల్ పోటీల్లో పాల్గొన్న భారత మహిళా జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. 2022లో సింగపూర్‌లో జరిగిన ఏషియా మహిళల నెట్‌బాల్ చాంపియన్‌షిప్, 2024లో బెంగుళూర్‌లో జరిగిన ఆసియా నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా జట్లకు కోచ్‌గా ఉన్నారు. అదేవిధంగా గత ఏడాది జూన్‌లో హాంకాంగ్‌లో నిర్వహించిన బౌహినియా కప్‌లో, దక్షిణా కొరియా జియెంజోలో జరిగిన ఏషియన్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో కోచ్‌గా వ్యవహరించి జట్టును ముందుకు నడిపించారు. హాంకాంగ్‌లో టోర్నీలో ఇండియన్ మహిళా జట్టు మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. నెట్‌బాల్ క్రీడపై ఉన్న ఆసక్తితో, క్రీడను రాష్ట్రంలో క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో విక్రమ్ ఆదిత్యరెడ్డి తెలంగాణ అమ్యెచూర్ నెట్‌బాల్ అసో సియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
● హంకాంగ్‌లో ఈనెల 8 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న 14వ ఏషియన్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత మహిళా జట్టుకు ఏకంగా హెడ్ కోచ్‌గా విక్రం ఆదిత్యరెడ్డి నియమితులయ్యా రు. భారత మహిళా జట్టుకు హెడ్ కోచ్‌గా ఆయన నియామకంపై అసోసియేషన్ సభ్యులు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.విక్రం ఆదిత్యరెడ్డి నియామకం జిల్లాకు ఎంతో గర్వకారణమని, ఆయన నేతృత్వంలో భారత మహిళల జట్టు ఏషియన్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచి దేశానికి పతకం తీసుకురావాలని ఆకాంక్షించారు.


