పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్‌ కసరత్తు | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్‌ కసరత్తు

Aug 6 2026 12:57 AM | Updated on Aug 6 2026 12:57 AM

ఇన్‌చార్జి మంత్రితో ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నాయకుల సమావేశం

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ పట్టభద్రులఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఈ స్థానాన్ని ౖహస్తగతం చేసుకునేలా ఆ పార్టీ సన్నద్ధమవుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హై దరాబాద్‌లోని తన నివాసంలో బుధవారం ఉమ్మడి జిల్లా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీలు, డీసీసీ అధ్యక్షులతో సమావేశమయ్యారు. మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి), డాక్టర్‌ వంశీకృష్ణ (అచ్చంపేట), వీర్లపల్లి శంకర్‌, (షాద్‌నగర్‌), ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, డీసీసీ అధ్యక్షులు సంజీవ్‌ ముదిరాజ్‌ (మహబూబ్‌నగర్‌), రాజీవ్‌రెడ్డి (గద్వాల), ప్రశాంత్‌రెడ్డి (నారాయణే పట)లు సమావేశంలో పాల్గొ న్నారు. సమావేశంలో ప్రజా ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై, త్వరలో ఖాళీ అవుతున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థి ఎంపికపై, అలాగే కోఆపరేటివ్‌ సొసైటీ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహా లపై విస్తృతంగా చర్చించారు. ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఆదేశాల మేరకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించాలని మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కోరారు. ఉమ్మడి జిల్లాలోని ఆశావాహుల వివరాలు, ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పేర్లను పీసీసీకి పంపించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement