విద్యార్థులకు షూ పంపిణీ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు షూ పంపిణీ

Aug 6 2026 12:57 AM | Updated on Aug 6 2026 12:57 AM

ఉమ్మడి జిల్లాలో 1.65 లక్షల

మందికి ప్రయోజనం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి మరో కొత్త పథకం అమలుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న విద్యార్థులకు షూ పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో షూ పంపిణీ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఎంఈఓలు, పాఠశాలల హెచ్‌ఎంలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా పాఠశాలలో ఉన్న విద్యార్థులు, వారికి వచ్చే సైజులు తదితర వివరాలను సేకరించాలని చెప్పారు. ఈ పథకంతో ఉమ్మడి జిల్లాలోని 2,200 పాఠశాలల్లో 1.65 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. వీరితోపాటు 68 ఇంటర్‌ ప్రభుత్వ కళాశాలలు, 68 కేజీబీవీల్లో చదువుతున్న 12 వేల మంది విద్యార్థులకు మేలు జరగనుంది.

జీవిత బీమా

ఉద్యోగుల నిరసన

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట బుధవారం భోజన విరామ సమయంలో జీవిత బీమా ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ హైదరాబాద్‌ డివిజన్‌ ఉపాధ్యక్షుడు వి.రాజేశ్వర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీలో 6.5 శాతం పెట్టుబడుల ఉపసంహరణను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటా 96.5శాతం కాగా ఈ ఉపసంహరణతో 90 శాతానికి పడిపోతుందన్నారు. ఉపసంహరణ ద్వారా పాలసీదారులకు, ఎల్‌ఐసీ సంస్థకు లేదా ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఇలాంటి చర్యలు ప్రైవేటీకరణకు దారితీస్తాయన్నారు. ఎల్‌ఐసీ జాతీయికరణకు వ్యతిరేకమని, దేశాభివృద్ధికి విఘాతమన్నారు. ఈ నిరసనలో కరుణాకర్‌గౌడ్‌, సత్యనారాయణ, సాయిబాబా, నారాయణ నాయక్‌, ఆనందం, రాజేందర్‌, రోహిత్‌, ఇష్రాత్‌అలీ, నరేందర్‌, శ్రీనివాసులు, ఖదీర్‌, పర్విన్‌, ప్రియాన్షి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement