గద్వాల/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద భారీగా చేరుతోంది. మంగళవారం 2,41,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు 33 క్రస్టుగేట్లు ఎత్తి దిగువనకు 2,21,331 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నా రు. విద్యుదుత్పత్తికి 26,817 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టుకు 750, భీమా–1కు 1,300, భీమా–2కు 872, కోయిల్‌సాగర్‌కు 630, ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు 820, ప్రధాన కుడి కాల్వకు 675, సమాంతర కాల్వకు 535 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 2,53,102 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. సోమవారం కేవలం ఎగువలో 6 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 234 మెగావాట్లు, ఇప్పటివరకు 26.139 ఎం.యూ., దిగువలో 25.716 ఎం.యూ. విద్యుదుత్పత్తి చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 51.855 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు.
6 యూనిట్లలో 234 మెగావాట్ల ఉత్పత్తి


