కోచ్‌ల నియామకంతోనే ప్రతిభ గల క్రీడాకారులు వెలుగులోకి.. | - | Sakshi
Sakshi News home page

కోచ్‌ల నియామకంతోనే ప్రతిభ గల క్రీడాకారులు వెలుగులోకి..

Jul 27 2026 1:12 AM | Updated on Jul 27 2026 1:12 AM

కోచ్‌ల నియామకంతోనే ప్రతిభ గల క్రీడాకారులు వెలుగులోకి..

మహబూబ్‌నగర్‌ క్రీడలు: క్రీడా వసతులతోపాటు కోచ్‌ల నియామకంతోనే ప్రతిభగల క్రీడాకారులు వెలుగులోకి వస్తారని అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, ఇండియన్‌ కబడ్డీ కోచ్‌ ఎల్‌.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో నిర్వహించిన కబడ్డీ అకాడమీ బాలుర ప్రవేశాల ఎంపికలను పర్యవేక్షించిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహబూబ్‌నగర్‌లో కబడ్డీ అకాడమీ ఏర్పాటు కావడం సంతోషంగా ఉందని, రాష్ట్రంలో ఏకై క కబడ్డీ అకాడమీ ఇదేనని పేర్కొన్నారు. ఇక్కడ ప్రత్యేక నిపుణులైన కోచ్‌లను నియామాకం చేస్తే అనతికాలంలోనే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. గ్రామీణ క్రీడాకారుల టాలెంట్‌ను వెలికితీసేది మొదట పీఈటీలేనని చెప్పారు. క్రీడాకారుడిగా, కోచ్‌గా ఒక్కటే విన్నపం అని.. ప్రతిభగల క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగావకాశాలు కల్పించాలని, ముఖ్యంగా ప్రతి శాఖలో 2 శాతం స్పోర్ట్స్‌ కోటా అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు.

– ‘సాక్షి’తో అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, కోచ్‌ ఎల్‌.శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement