లక్ష్మీతండాలో రైతు దారుణహత్య | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీతండాలో రైతు దారుణహత్య

Jul 27 2026 1:12 AM | Updated on Jul 27 2026 1:12 AM

గోపాల్‌పేట: ఇంట్లో పడుకున్న రైతును గొంతుపై నరకడంతో అక్కడికక్కడే మృతిచెందిన దారుణ ఘటన వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని బుద్దారం లక్ష్మీతండాలో ఆదివారం సాయంత్రం వెలుగుచూసింది. తండావాసుల కథనం ప్రకారం.. మండలంలోని బుద్దారం లక్ష్మీతండాకు చెందిన ముడావత్‌ మేఘ్యానాయక్‌(55) తనకున్న మూడెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మేఘ్యానాయక్‌ భార్య నాను ఏడాది కిందట మృతిచెందింది. ఇద్దరు కుమారులు శ్రీను, కిషన్‌.. హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇదేక్రమంలో శనివారం పెద్దకుమారుడు ఇంటికి వచ్చి తిరిగి హైదరాబాద్‌ వెళ్లాడు. శనివారం రాత్రి మేఘ్యానాయక్‌ రాత్రి పదిగంటల సమయంలో కాలనీవాసులతో మాట్లాడి ఇంట్లో పడుకున్నాడు. ఆదివారం సాయంత్రం 4గంటలవరకు ఇల్లు తెరవకపోవడంతో పక్కింటివారు వెళ్లి తలుపు తెరువగా మేఘ్యానాయక్‌ అప్పటికే రక్తపుమడుగులో మృతిచెంది కనిపించాడు. దీంతో వెంటనేవారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్‌టీం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. డీఎస్‌పీ గిరిబాబు, సీఐ రత్నం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి బాడీని పోస్టుమార్టం కోసం తరలించామని అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శశిధర్‌ తెలిపారు.

పుట్టెడు దుఃఖంలోనూ

వెల్లివిరిసిన ‘మానవత్వం’

గండేడ్‌/మహమ్మదాబాద్‌: తమ కుటుంబ సభ్యుడు చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్నా.. వారిలో మానవత్వం వెల్లివిరిసింది. మరొకరికి కంటిచూపు ప్రసాదించేందుకు కళ్లను దానం చేశారు. వెలకట్టలేని వారి విలువైన దాతృత్వానికి ఈ ఘటన నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్‌ జిల్లా లింగనపల్లికి చెందిన రాఘవేందర్‌గౌడ్‌ (37) తల్లి 30 ఏళ్ల క్రితం చనిపోవడంతో మహమ్మదాబాద్‌ మండల కేంద్రానికి చెందిన మేనమామ సార రాములు చేరదీశాడు. డిగ్రీ మధ్యలోనే ఆపేసిన రాఘవేందర్‌గౌడ్‌ మీసేవ కేంద్రాలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల గండేడ్‌ మండలంలోని వెన్నాచేడ్‌ మీసేవలో పనిచేస్తున్నాడు. ఈ క్ర మంలో ఆదివారం ఉదయం 11 గంటలకు బైక్‌ౖ పె మహబూబ్‌నగర్‌కు వెళ్తున్న ఆయనను హ న్వాడ మండలంలోని పల్లెమోని కాలనీ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు 108 అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్‌ ఆస్పకి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయి తే అతడి కళ్లు దానం చేస్తే మరొకరికి చూపు ప్ర సాదించవచ్చని డాక్టర్లు చెప్పడంతో.. మేనమామ రాములు మానవత్వంతో ఆలోచించి అందుకు అంగీకరించారు. దీంతో డాక్టర్లు ఎల్వీ ప్ర సాద్‌ కంటి ఆస్పత్రి వారికి సమాచారం ఇ చ్చా రు. హైదరాబాద్‌ నుంచి వారు వచ్చిన సి బ్బంది మృతుడు రాఘవేందర్‌ రెండు కళ్లను తీసుకెళ్లారు. అనంతరం మేనమామ రాములు కు ప్రశంసాపత్రం అందజేశారు. పోస్టుమార్టం అ నంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించడంతో ఆదివారం సాయంత్రం మహమ్మదాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement