కాల్వ సర్వేకు సర్పంచులు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

కాల్వ సర్వేకు సర్పంచులు సహకరించాలి

Jul 26 2026 3:02 AM | Updated on Jul 26 2026 3:02 AM

నవాబుపేట: పాలమూర్‌–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మాణం చేయాల్సిన లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్‌కు మండల సమీపంలోని ఉదండాపూర్‌ రిజర్యాయర్‌ నుంచి ఏర్పాటు చేసే కాల్వ నిర్మాణాలకు ఆయా గ్రామాల సంర్పచులు సహకరించాని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాంరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో కాల్వ నిర్మాణంపై స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కాల్వ నిర్మాణం జరిగే గ్రామాల సర్పంచులతో సమీక్ష నిర్వహించారు. కాగా మండలంలో దాదాపుగా 1091 ఎకరాలు కాల్వ నిర్మాణంలో 9గ్రామాల రైతులు భూములు కోల్పోనున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు అత్యంత అవసరమైన కాల్వ నిర్మాణానికి తాజాగా సర్వే జరుగుతుందని దీన్ని త్వరగా పూర్తిచేసేలా సర్పంచులు సహకరించాలని సూచించారు. కాల్వ సర్వేలో రైతులకు చెందిన భూమి ఏ సర్వే నంబర్‌లో రైతులు ఎంత కోల్పోతున్నారన్న విషయం పూర్తి ఖరారు చేసిన అనంతరం పరిహారం విషయం తేలుద్దామని సూచించారు. పరిహారం ప్రభుత్వ తాజాగా తీసుకున్న కొత్త నిబంధనల ప్రకారం ఉండే అవకాశం ఉందని వివరించారు. ప్రధానంగా కాల్వ స్వరూపం, రైతుల గుర్తింపు లాంటివి పూర్తిగా ఖరారు కావాల్సి ఉందని అందుకు గ్రామలవారీగా సర్పంచులు సహకరించాలని సూచించారు. కాల్వ నిర్మాణంపై రైతులకు సర్పంచులు అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు అపోహపడాల్సిన అవసరం లేదని వారికి తగిన న్యాయం జరుగుతుందని ెసూచించారు.

ప్రాజెక్టు కాల్వ నిర్మాణంపై స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాంరెడ్డి సమీక్ష

ఇంటికో ఉద్యోగం, మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం

ప్రాజెక్టు కోసం తీసుకొస్తున్న కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు తాజాగా మర్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని వివిధ గ్రామాల సర్పంచులు కోరారు. ప్రభుత్వ ధర ప్రకారం చెల్లించాల్సి వస్తే ప్రభుత్వ ధరకు నాలుగు రెట్లు ధర ఎకరానికి పరిహారం అందించాలని సూచించారు. దీంతోపాటు భూములు కోల్పోయిన రైతులకు ఇందిరమ్మ ఇంటితోపాటు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సర్పంచులు సూచించారు. సమావేశంలో ఆర్‌ఐలు రామాంజనేయులు, గాయిత్రీ, సర్పంచులు గీతారాణి, రంజిత్‌గౌడ్‌, వెంకటే్‌ష్‌, రవీందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement