సోమేశ్వరా.. సల్లంగా చూడు | - | Sakshi
Sakshi News home page

సోమేశ్వరా.. సల్లంగా చూడు

Jul 26 2026 3:02 AM | Updated on Jul 26 2026 3:02 AM

కొల్లాపూర్‌ రూరల్‌: తొలి ఏకాదళి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణానది బ్యాక్‌వాటర్‌లో పుణ్యస్నానాలు ఆచరించి సోమేశ్వరునితోపాటు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, లలితాంబిక అమ్మవారికి దర్శించుకోవాడానికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అమరగిరి గ్రామ సమీపంలో ఉన్న మల్లయ్యసెలలో కొలువుదీరిన మల్లయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

సంగమేశ్వరాలయానికి వెళ్లే భక్తులకు నిరాశ

సోమశిల నుంచి కృష్ణానదిలో సంగేమేశ్వరుడిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు నిరాశ ఎదురైయింది. సోమశిలకు సంబంధించిన బోట్లను సంగమేశ్వరాలయానికి రాకుండా అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. బోట్లు బంద్‌ కావడంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement