జడ్చర్ల టౌన్: ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్శామికి ఆషాడ శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని వైభవంగా లక్ష పుష్పార్చన జరిపించారు. కాళ్ల మంటపం వద్ద స్వామివారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి ఆలయ కార్యనిర్వహణాధికారి దీప్తిరెడ్డి పుష్పార్చన ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు సామూహిక కుంకుమార్చనలు చేశారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభమైన వేడుకలు పంచామృతాభిషేకం, పుణ్యాహవచనము, రుత్విక్వరణం, ప్రదోష పూజ, శయనోత్సవం నిర్వహించారు. ఆదివారం సహాస్రనామార్చన, మహానివేదనతో వేడుకలు ముగుస్తాయి. ఏకాదశి పురస్కరించుకుని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.


