కంది సాగు.. జాగ్రత్తలతోనే లాభాలు | - | Sakshi
Sakshi News home page

కంది సాగు.. జాగ్రత్తలతోనే లాభాలు

Jul 20 2026 12:44 AM | Updated on Jul 20 2026 12:44 AM

మిడ్జిల్‌: కందిపంటను ముఖ్యంగా మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, కొమరంభీమ్‌, ఆసిఫాబాద్‌, జోగులాంబ గద్వాల, సుర్యాపేట, నల్గొండ జిల్లాలో ఎక్కువ సాగు చేస్తుంటారు. అయితే ఈ ఆరుతడి పంటలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చని మండల వ్యవసాయ అధికారి సిద్దార్థ సూచిస్తున్నారు.

కంది పంటకు అనువైన నేలలు:

ఎర్ర చల్కా, నల్లరేగడి, మురుగునీరు పోయే వసతి గల నేలలు అనుకూలం. చౌడు, నీటి మంపునకు గురయ్యే నేలలు కంది పంట సాగుకు పనికిరావు.

రకం పంట కాలం దిగుబడి (ఎకరానికి క్వింటాళ్లలో) ఎల్‌.ఆర్‌జి 41, 180 రోజులు 8 నుంచి 10

పైరు ఒకే సారి పూతకు రావడం వలన కొమ్మలు వంగుతాయి, శనగపచ్చ పురుగును బాగా తట్టుకుంటుంది. నల్లరేగడి భూములు అనుకూలం. నీటీ వసతితో తేలికపాటి భూములలో కూడా పండించవచ్చు. ఎండు తెగులును తట్టుకోదు.

లక్ష్మి (ఐసిపిఎల్‌ 85063) 160 నుంచి 170 రోజులు 7–8 ఈరకం విత్తనాలు చెట్టు గుబురుగా ఉండి ఎక్కువ కొమ్మలు కల్గి ఉంటాయి. ఎండుతెగులను కొంత వరకు తట్టుకుంటుంది.

ఆశ (ఐసిపిఎల్‌87119) 170 నుంచి 180 రోజులు 7 – 8 మొక్క నిటారుగా, గుబురుగా పెరుగుతుంది. వ్యుజేరియమ్‌ ఎండు, వెర్రి తెగుళ్లను తట్టుకుంటుంది. గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయి.

● మారుతి (ఐసిపి 8863) 155 రోజుల నుంచి 160 రోజులు 7 – 8 మొక్క నిటారుగా పెరుగుతుంది. ఎండు తెగులును తట్టుకొంటుంది. గింజలు, మధ్యస్థ లావుగా ఉంటాయి. వరి, మగాణి, గట్ల మీద పెంచుటకు కూడ అనువైన రకం.

● డబ్ల్యూ,ఆర్జీ 27 180 రోజులు, 7–8

మొక్కలు ఎత్తుగా పెరుగుతాయి. కాయలు ఆకుపచ్చగా ,ముధురు గోధుమ రంగు చారలు కలిగి ఉంటాయి. శనగపచ్చ పురుగు కొంత మేరకు తట్టుకుంటాయి,

● పాలెం కంది (సిఆర్‌జి 158) 150–155 రోజులు 6 –7

దక్షణ తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు అనువైనది. ప్యుజేరియమ్‌ ఎండు తెగులును తట్టుకుంటాయి.

● సూర్య (యంఆర్‌జి 1004) 165–180 రోజులు, 8–9 క్వింటాల దిగుబడి.

మొక్క నిటారుగా, గుబురుగా పెరుగుతుంది. పువ్వులు పసుపు పచ్చగా ఉంటాయి గింజలు లావుగా గోధుమ రంగులో ఉంటాయి.

● వరంగల్‌ కంది 53(డబ్ల్యుఆర్‌జి) 160 –180 రోజులు 6–8

కాయతొలుచు పురుగును కొంత వరకు తట్టుకుంటుంది.

● ఆర్‌జిటి–1(తాండురు తెల్లకంది) 145 –155 రోజులు 5–6

ప్యుజేరియమ్‌ ఎండు తెగులును తట్టుకుంటుంది. అంతరపంటలకు అనుకూలం.

● డబ్ల్యుఆర్‌జి –65(రుద్రేశ్వర) 160–180 రోజులు 8–10

ఎండు తెగులు, శనగపచ్చ పురుగును కొంతవరకు తట్టుకుంది. నల్లరేగడి భూములకు అనువైన పంట.

● టిడిఆర్‌జి–4( హనుమ)160–180 రోజులు 8–10

● ఎండుతెగులును పూర్తిగా తట్టుకుంటుంది. వెర్రి తెగులు శనగపచ్చ పురుగును కొంత మేర తట్టుకుంటుంది.

ఐసిసిహెచ్‌–2740(మన్నెంకొండ కంది) 170–190 రోజులు 8–10

ఎండు తెగులున, వెర్రి తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. నల్లరేగడి భూములకు, నీటి పారుదలకు అనువైన రకం.

విత్తనశుద్ధి:

మొదటగా విత్తనాలకు థైరామ్‌ లేదా కాప్టాన్‌ ఒక కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున పట్టించాలి, ఆతర్వాత విత్తుకొనే ముందు 200 నుండి 400 గ్రాముల రైజోబియంను ఎకరం విత్తనానికి కలిపి విత్తుకోవాలి. ఖరీఫ్‌లో నల్లరేగడి భూమిలో సాలుకు, సాలుకు మధ్య 150 లేదా 180 సెం.మీ, ఎర్ర చల్కా భూమిలో సాలుకు, సాలుకు 90 లేదా 120 సెం.మీ, మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ ఉండేలా విత్తుకోవాలి.

పాడి–పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement