ఔత్సాహికులకు వరం.. | - | Sakshi
Sakshi News home page

ఔత్సాహికులకు వరం..

Jul 20 2026 12:44 AM | Updated on Jul 20 2026 12:44 AM

రాష్ట్రంలోని క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు ఎంపికలు

మహబూబ్‌నగర్‌లో కబడ్డీ, వాలీబాల్‌, వనపర్తిలో హాకీ అకాడమీలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: స్పోర్ట్స్‌ అకాడమీలు ఔత్సాహిక క్రీడాకారులకు వరంలా మారుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తున్న క్రీడాకారుల్లో చాలామంది స్పోర్ట్స్‌ అకాడమీల నుంచి వచ్చినవారే. దీంతో ప్రతి ఏడాది రాష్ట్రంలోని స్పోర్ట్స్‌ అకాడమీల్లో ప్రవేశాలకు బాల, బాలికల ఎంపికలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలోని క్రీడా అకాడమీలు..

రాష్ట్ర క్రీడాప్రాధికారిక సంస్థ (ఎస్‌ఏటీజీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా అకాడమీలు, క్రీడా వసతి గృహాల్లో 2026– 27 సంవత్సరానికి గాను ప్రవేశాలకు సైక్లింగ్‌, రెజ్లింగ్‌, అథ్లెటిక్స్‌, జిమ్నాస్టిక్‌, వాలీబాల్‌, స్విమ్మింగ్‌, ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, కబడ్డీ, హాకీ అకాడమీల్లో ప్రవేశాల కోసం ఎంపికలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఓయూ క్యాంపస్‌లోగల సైక్లింగ్‌ వెల్‌డ్రోమ్‌ అకాడమీలో ఈ నెల 20న బాలుర ఎంపికలు నిర్వహించనున్నారు. 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వారు ఎంపికలకు అర్హులు. సరూర్‌నగర్‌లోని వాలీబాల్‌ అకాడమీలో ఈ నెల 20, 21 తేదీల్లో బాల, బాలికల ఎంపికలు నిర్వహించనున్నారు. 16 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు అర్హులు. సిద్ధిపేటలోని వాలీబాల్‌ అకాడమీలో బాల, బాలికలు, సిరిసిల్లలోని మినీ స్టేడియంలో బాలురకు వాలీబాల్‌ అకాడమీల్లో ఈ నెల 22, 23 తేదీల్లో ఎంపికలు చేపడుతారు. 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వారు ఎంపికలకు అర్హులు. మహబూబ్‌నగర్‌లోని వాలీబాల్‌ అకాడమీలో ఈనెల 25, 26 తేదీల్లో బాల, బాలికలకు, కబడ్డీ అకాడమీలో బాలుర ఎంపికలు నిర్వహించనున్నారు. 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వారు ఎంపికలకు అర్హులు. ఖమ్మంలోని అథ్లెటిక్స్‌ అకాడమీలో బాలురకు ఈ నెల 21వ తేదీన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియంలో ఎంపికలు నిర్వహించనున్నారు. 14 ఏళ్ల నుంచి 16 ఏళ్లవారు ఎంపికలకు అర్హులు. ఎల్‌బీ స్టేడియంలోని హ్యాండ్‌బాల్‌ అకాడమీలో బాలుర, ఫుట్‌బాల్‌ అకాడమీలో బాలురకు ఈ నెల 20, 21 తేదీల్లో ఎంపికలు నిర్వహించనున్నారు. 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వారు ఎంపికలకు అర్హులు. 20, 21 తేదీల్లో గచ్చిబౌలీ హాకీ అకాడమీలో బాల, బాలికలకు, అథ్లెటిక్స్‌ అకాడమీలో బాల, బాలికలకు, వనపర్తిలోని హాకీ అకాడమీకి సంబంధించి ఎంపికలు నిర్వహించనున్నారు. 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వారు ఎంపికలకు అర్హులు.

మహబూబ్‌నగర్‌లో కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement