భక్తుల రద్దీ..
హైదరాబాద్ నల్లపోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాల జాతర
పత్తి చేనును ట్రాక్టర్‌తో తొలగిస్తున్న దృశ్యం
అలంపూర్ రూరల్: జోగుళాంబ అమ్మవారికి హైదరాబాద్ పాతబస్తీ నల్లపోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం వెండి బోనాన్ని సమర్పించారు. మురాద్‌మహాల్ నల్లపోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 500 మందితో అలంపూర్‌లో బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ నిత్యాన్నదాన సత్రంలో బోనాలకు ప్రత్యేక పూజలు జరిపి.. పురవీధుల గుండా ఊరేగిస్తూ.. ఆలయానికి చేరుకుని జోగుళాంబదేవికి బోనాలను సమర్పించారు. బోనాల జాతరలో టీజీఎస్‌జీడీసీఎఫ్‌ఎల్ చైర్‌పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సతీమణి మహాలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సరిత మాట్లాడుతూ నల్లపోచమ్మ గుడి కమిటీ ఆధ్వర్యంలో బోనాలు తీసుకురావడం సంతోషకరమన్నారు. రెండేళ్ల నుంచి ఇక్కడ బోనాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మవారి ఆశీర్వాదం మనందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారికి బోనాలు సమర్పించిన రోజే వర్షం కురవడం శుభాసూచికమని పేర్కొన్నారు.
వాన కురవక.. ఆశలు తీరక
జోగుళాంబదేవి ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిక్కిరిసింది. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దర్శనానికి క్యూలైన్లలో బారులుతీరారు. అలాగే బోనాల జాతరలో వాయిధ్య కళాకారులు చేసిన ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. వివిధ రకాల విన్యాసాలతో డప్పులను వాయించగా.. పోతురాజుల వేషధారణతో చిందులేస్తూ అలరించారు. కార్యక్రమంలో నల్ల పోచమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్, చైర్మన్ శ్యాంరామ్ కుర్మ, కార్యదర్శి శరత్, మణికంఠ కుర్మ, అలంపూర్ ఆలయ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్లు, మాజీ మెంబర్ నాగశిరోమణి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


