చేపలు పట్టేందుకు వెళ్లి జాలరి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

చేపలు పట్టేందుకు వెళ్లి జాలరి గల్లంతు

Jul 20 2026 12:44 AM | Updated on Jul 20 2026 12:44 AM

చేపల వేటకువెళ్లి మత్స్యకారుడు మృతి

పోలీస్‌, ఫైర్‌ సిబ్బంది వెతికినా

దొరకని ఆచూకీ

ఉప్పునుంతల: మండలంలోని మామిళ్లపల్లి ఊర చెరువులోకి చేపల వేటకు వెళ్లిన జాలరి నీటిలో గల్లంతైన ఘటన శనివారం సాయంత్రం ఆలస్యంగా వెలుగుచూసింది. గోపాల్‌పేట మండలం బుద్దారానికి చెందిన ఆవుల తిరుపతయ్య (55)కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పిల్లలతో కలిసి సొంతూరు బుద్దారంలోనే ఉండగా.. మామిళ్లపల్లికి చెందిన రెండో భార్య చంద్రమ్మతోనే కొంతకాలంగా ఉంటూ కూలీ పనులతో జీవనం సాగిస్తూ అప్పుడప్పుడు చేపల వేటకు వెళ్లేవాడు. శనివారం ఉదయం భార్య చంద్రమ్మ పనులపై బుద్దారం వెళ్లగా.. ఇంటివద్ద ఉన్న తిరుపతయ్య మధ్యాహ్నం సమయంలో గ్రామాన్ని అనుసరించి ఉన్న ఊరచెరువులోకి చేపల వేటకు వెళ్లాడు. సాయంత్రం ఊరి నుంచి ఇంటికి వచ్చిన చంద్రమ్మ భర్తను వెతుకుతూ అనుమానంతో చెరువు వద్దకు వెళ్లింది. చెరువు ఒడ్డున భర్త చెప్పులు, దుస్తులు, సెల్‌ఫోన్‌ ఉండటంతో పరిసర ప్రాంతంలో వెతికినా ఆచూకీ తెలియలేదు. అక్కడున్న ఆనవాళ్లను బట్టి తన భర్త చెరువులో ముని గిపోయి ఉంటాడనే భావనతో గ్రామస్తులతో కలిసి చంద్రమ్మ పోలీసులను ఆశ్రయించింది. ఆదివారం ఎస్‌ఐ మహేష్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది, డివిజన్‌తోపాటు జిల్లా నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఫైర్‌ సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు చెరువులో గాలించినా తిరుపతయ్య ఆచూకీ లభించలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.

కందనూలు: జిల్లా కేంద్రంలోని కేసరి చెరువులో కి చేపల వేటకు వెళ్లి మ త్స్యకారుడు మృతిచెందిన ఘటన చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని సంతబజార్‌కు చెందిన పులమోని కృష్ణ(34) ఆదివారం మధ్యాహ్నం చేపలు పట్టడానికి కేసరి చెరువులోకి దిగి వల వేసి చేపలు పట్టేక్రమంలో ప్రమాదవశాత్తు వల కాళ్లకు చుట్టుకొని నీటిలో మునిగిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు గమనించి అతనిని చెరువలో నుంచి బయటకు తీసు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై భార్య ఫిర్యాదు మేరకు ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement