పీయూలోనే సెమినార్‌ నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పీయూలోనే సెమినార్‌ నిర్వహించాలి

Jul 17 2026 3:34 AM | Updated on Jul 17 2026 3:34 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలోనే జాతీయ సెమినార్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం పీయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా పాలమూరు ప్రాంతానికి జాతీయ సదస్సు నిర్వహించే అవకాశం వచ్చిందన్నారు. ఇది పాలమూరు విద్యార్థులు, యూనివర్సిటీకి ఎంతో గర్వమని.. పీయూకు జాతీయస్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. సదస్సును హైదరాబాద్‌కు తరలించడం అంటే ఇక్కడి విద్యార్థుల మనోభావాలు దెబ్బతీయడమేనని అన్నారు. అధికారులు వెంటనే సెమినార్‌ను పీయూకు మార్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కార్తిక్‌, రాము, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకులు సుదీప్‌, పీడీఎస్‌యూ నాయకులు మారుతి, పీయూ జేఏసీ కన్వీనర్‌ సాయి అభినయ్‌, వెంకటేశ్‌, శ్రీను పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement