స్టేషన్ మహబూబ్‌నగర్:హైదరాబాద్‌లో ఈనెల 25వ తేదీన దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సీఎస్‌ఆర్ సమ్మిట్‌లో గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా పాల్గొ నాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి ఆహ్వానం అందింది. ప్రతిష్టాత్మక సమ్మిట్‌కు సంబంధించి నిర్వాహకులు ఎమ్మె ల్యేకు ఆహ్వానపత్రాన్ని అందజేశారు. సమ్మిట్‌కు దేశంలోని వివిధ రంగాలకు చెందిన 300 మందికిపై కార్పొరేట్ ప్రతినిధులు, 1200కు పైగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, 100కిపై గా వ్యాపారవేత్తలు పాల్గొననుండగా వివిధ రంగాలకు చెందిన ఎనిమిది మంది ప్రముఖులు కీలక ప్రసంగాలు చేయనున్నారు. వారిలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విద్యపైన ప్రసంగం చేయనున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న ఎడ్యుకేషన్ మాడల్‌ను తన ప్రసంగంలో వివరించనున్నారు.
జీఓ నంబర్ 9
రద్దు చేయాలి
జడ్చర్ల టౌన్: 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రకుల పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే జీఓ నంబర్ 9 ను వెంటనే రద్దు చేయాలని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని మండల విద్యావనరుల కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథావిధిగా అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ముఖ్యమంత్రి మొండి వైఖరి వీడి విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయకపోతే విద్యార్థి సంఘాలతో కలిసి ఐక్య కార్యాచరణ చేపట్టి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయా ల్సి వస్తుందన్నారు. సమావేశంలో బీసీ జాగృతి సేన నాయకులు రఘునందన్‌చారి, నర్సింము లు, మాచారం శ్రీనివాస్, గౌరిశంకర్, లింగంపేట శేఖర్, గోపాల్, మురళి, రఘు, చెన్నయ్య, శ్రీనివాస్, అంజి, గణేష్ పాల్గొన్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో
సామగ్రి దగ్ధం
భూత్పూర్: మండలంలోని మద్దిగట్లలో గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి నివాసంలో బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్, వంట సామగ్రి దగ్ధమైంది. బాధిత కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ కాలిపోయింది. అదేవిధంగా ఇంట్లో వంట సామాగ్రి దగ్ధమవుతుండగా చుట్టు పక్కల వాళ్లు గమనించి వెంటనే తలుపులు పగలగొట్టి ఇంట్లోని వంట గ్యాస్ సిలిండర్‌ను బయటకు తీసుకొచ్చారు. నీళ్లు పోసి పోసి మంటలు ఆర్పారు. వెంటనే యజమానికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని సర్పంచ్ నత్తి సురేష్ పరిశీలించారు.
అగ్నిప్రమాదంలో గుడిసె దగ్ధం
అమరచింత(ఆత్మకూర్): ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో గుడిసె దగ్ధమైన ఘటన మండలంలో గురువారం చోటు చేసుకున్నది. బాధితుల క థనం ప్రకారం.. పట్టణంలో 5వ వార్డులో నివాసముంటున్న బైనీ ఎల్లమ్మకు చెందిన గుడిసె ప్ర మాదవశాత్తు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. వెంటనే విషయం తెలుసుకున్న ఫైర్ అధికారు లు ఘటనా స్థలానికి వెళ్లి పైర్ ఇంజిన్‌తో మంటలను ఆర్పేయత్నం చేసిన ఫలితం లేకుండాపోయింది. కాంగ్రెస్ మండల,పట్టణ అధ్యక్షులు నాగేష్, ఈర్లదిన్నె శ్రీనివాసులు, కౌన్సిలర్ దండు శ్రీనివాసులు బాధిత మహిళను పరామర్శించి ప్రభు త్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


