తండ్రి మరణం తట్టుకోలేక కుమారుడు మృతి | - | Sakshi
Sakshi News home page

తండ్రి మరణం తట్టుకోలేక కుమారుడు మృతి

Jul 17 2026 3:34 AM | Updated on Jul 17 2026 3:34 AM

తాడూరు: తండ్రి మరణం త ట్టుకోలేక కుమారుడు మృతి చెందిన ఘటన మండలంలోని యాదిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెన్నాళ్ల కాలనీ లో గురువారం సా యంత్రం చోటు చేసుకొంది. గ్రా మస్తుల వివరాల ప్రకారం కాలనీకి చెందిన సాయిలు(75) అనారో గ్యంతో బుధవారం రాత్రి మృతి చెందగా అంత్య క్రియలు గు రువారం నిర్వహించారు. అనంతరం ఇంటికి చేరుకున్న కొడుకు బంగారయ్య (50) కుప్పకూలాడు. కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బంగారయ్యకు భార్యతో పాటు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒకేరోజు వ్యవధితో తండ్రి, కుమారుడు మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.

బస్టాండ్‌లో బంగారం చోరీ

వనపర్తి రూరల్‌: బస్టాండ్‌లో తులం బంగారు ఆభ రణం చోరీ జరిగిన ఘటన చోటు చేసుకున్నది. ఎస్‌ ఐ హరిప్రసాద్‌ తెలిపిన వివరాలు ప్రకారం.. వనపర్తికి చెందిన వృద్ధురాలు జయమ్మ గురువారం ఉద యం జడ్చర్లకు వెళ్లడానికి ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుంది. బస్సు ఎక్కుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు తన సంచిలో ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌ చోరీ చేశారు. దాంట్లో తులం బంగారు ఆభరణం చోరీకి గురైనట్లు గు ర్తించింది. వెంటనే బాధితురాలు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement