ద్విచక్రవాహనంపై నుంచి పడి మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనంపై నుంచి పడి మహిళ మృతి

Jul 17 2026 3:34 AM | Updated on Jul 17 2026 3:34 AM

గట్టు: మండల పరిధిలోని బల్గెర గ్రామంలో ద్విచక్రవాహనం పై నుంచి కింద పడి నర్సమ్మ (52) అనే మహిళ మృతి చెందిన ఘటనపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌గౌడు తెలిపారు. వివరాలిలా.. గ్రామానికి చెందిన నర్సమ్మ పెద్ద కుమారుడు బసప్పతో కలిసి బుధవారం సాయంత్రం పొలం పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు. బల్గెర సమీపంలో బైక్‌ అదుపుతప్పి కిందపడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. నర్సమ్మ తలకు బలమైన గాయాలు కావడంతో ముందుగా అయిజకు, అక్కడి నుంచి కర్నూలుకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. మృతురాలి కుమారుడు భీమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

పిచ్చికుక్క స్వైరవిహారం

ఒకే రోజు ఐదుగురిపై దాడి

ఉప్పునుంతల: ఉప్పునుంతల మండలకేంద్రలో గు రువారం ఓ పిచ్చికుక్క స్వై రవిహారం చేసింది. గంట వ్యవధిలో ఏకంగా ఐదుగురిపై దాడిచేసి గాయపరిచింది. మొదట గ్రామ స మీపంలోని మైల్‌ స్టోన్‌ పాఠశాల వద్ద కుమా రుడిని పాఠశాలకు తీసుకెళ్తున్న చింతగాళ్ల పరమేష్‌తో పాటు అతని కుమారుడు మూడేళ్ల విజ్ఞాన్‌ను కరిచింది. అక్కడి నుంచి గ్రామంలోకి వచ్చిన కుక్క పోచమ్మ చౌరస్తా సమీపంలోని మడ్డవోనిపంపు కాలనీలో పాఠశాలకు వెళ్తున్న లియాశ్రీ అనే బాలికపై దాడి చేయబోగా అడ్డుకున్న బాలిక తల్లి వెంకటమ్మపై దాడి చేసింది. దీంతో స్థానిక ప్రజలు కుక్కను అదరగొట్టగా ఎస్సీ కాలనీలో మరో మహిళ పొట్టల రామచంద్రమ్మ కాలుకు కరవడంతో గాయమైంది. కుక్క కాటుకు గురైన వారందరూ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న సర్పంచు సీహెచ్‌ శ్రీనివాసులు ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. గ్రామంలో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ మనుషులతో పాటు జంతువులపై దాడిచేస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడదను అరికట్టాలని కోరుతున్నారు.

పాముకాటుతో

వ్యక్తి మృతి

బల్మూర్‌: పాముకాటుతో వ్యక్తి మృతి చెందిన ఘట న గురువారం మండలంలోని మంగళకుంటపల్లిలో చోటుచేసుకుంది. స్థానికు లు తెలిపిన వివరాల ప్రకా రం గ్రామానికి చెందిన రొ డ్డ సైదుల(49) రోజువారిగా ఉదయం 5 గంటల ప్రాంతంలో మేకలదొడ్డిలోకి వెళ్లగా పా ముకాటుకు గురయ్యాడు. ఈ విషయం అతని భార్య కు చెప్పగా వెంటనే దొడ్డిలోకి వెళ్లి చూ డగా పా ము కన్పించలేదు.గ్రామంలోనే నాటు వైద్యం చేయించుకొని ఇంటికి వచ్చాడు. కొంత సమ యానికి పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య చెన్నమ్మతో పాటు కూతురు, కుమారుడు ఉన్నారు.

వృద్ధురాలు

అనుమానాస్పద మృతి

పెద్దకొత్తపల్లి:మండలంలో ని దేవునితిర్ములాపూర్‌ గ్రా మానికి చెందిన అనమోని నడిపి నాగమ్మ(70) అనే వృద్ధురాలు అనుమానాస్ప ద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. వృద్ధురాలు ఈనెల 14న ఇంటి నుంచి కనిపించ కుండా పోయింది. ఈ క్ర మంలో గురువారం దేవల్‌తిర్ములాపూర్‌ గ్రామ సమీపంలో పెద్ద బండ ప్రాంతంలో నాగమ్మ మృతదేహం కనిపించింది. దీంతో పెద్దకుమారుడు బాలరాజు తన తల్లి మృతిపై ఫిర్యాదు చేయడంతో కొల్లాపూర్‌ సీఐ శంకర్‌, ఎస్‌ఐ సతీ ష్‌ ఘటనా స్థలానికి వెళ్లి జాగిలాలతో పరిశీలించగా అవి కొంత మంది వ్యక్తులను పట్టుకోగా నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.అనంతరం మృతదేహానికి నాగర్‌కర్నూల్‌ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement