ఉల్లి ధర పెరగడం ఆనందంగా ఉంది. నిల్వ చేసుకున్నందుకు తగిన ఫలితం దక్కింది. మే నెలలో తెచ్చిన ఉల్లికి క్వింటాల్ ధర రూ.1,600 వరకు వచ్చింది. గత నెలలో మరోసారి 10 క్వింటాళ్ల ఉల్లి తెస్తే రూ.2,400 వచ్చింది. బుధవారం మరోసారి ఉల్లిని తెస్తే ధర రూ.3,300 పలికింది. 11 క్వింటాళ్లకు రూ.36 వేలు వచ్చాయి. గతంతో పోల్చితే రెండింతల లాభం వచ్చింది.
– లక్ష్మప్ప, ఉల్లి రైతు, ఊట్కూర్
ఊహించలేదు..
ఉల్లి ధర ఇలా పెరుగుతుందని ఊహించలేదు. సీజన్‌లో కొంత వరకు ఉల్లిని అమ్ముకున్నా ధర రూ.1,800 వరకు వచ్చింది. తర్వాత దిగుబడిగా వచ్చిన ఉల్లిని నిల్వ చేసుకుని ఇప్పుడు అమ్మకాని తెస్తే క్వింటాల్ ధర రూ.3,200 వచ్చింది. ఇంతలా ధర పెరగడం ఆనందంగా ఉంది. మరికొంత నిల్వ చేసిన ఉల్లి ఉంది. తర్వాత అమ్మకానికి తెస్తా.
– రాములప్ప, ఉల్లిరైతు, నాగిరెడ్డిపల్లి
●


