స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని కంచికామకోటి పీఠం పాలమూరుశాఖ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 34వ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం మూలమంత్ర అనుష్టానాలు నిర్వహించారు. లోకకళ్యాణార్థం, వర్షం కోసం ప్రత్యేకంగా వరుణయాగం నిర్వహించారు. పండితులంతా నీళ్లల్లో కూర్చొని వరుణ జపం, వరుణ హోమం నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని గజవాహనంపై ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవేంకటేశ్వర సేవా మండలి అధ్యక్షుడు శ్రీకాంత్‌శర్మ, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్రశర్మ, సభ్యులు పాల్గొన్నారు.


