● విద్యార్థులకు యాంటీ డ్రగ్ సోల్జర్ సర్టిఫికెట్లతో సత్కారం
వనపర్తి: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం ప్రతి విద్యార్థి విజయానికి తొలి అడుగు అని, ప్రతి విద్యార్థి ‘యాంటీ డ్రగ్ సోల్జర్‘గా సమాజంలో చైతన్యం తీసుకురావాలని వనపర్తి డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సోమవారం మాదకద్రవ్యాల నిర్మూలన విద్యార్థినుల భద్రత, మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్, ఎస్‌ఐ అంజాద్, కళాశాల ప్రిన్సిపాల్ నవీన, వైస్ ప్రిన్సిపాల్ సంయుక్తంగా ప్రశంసా పత్రాలు, పతకాలు, ‘యాంటీ డ్రగ్ సోల ్జర్‘ సర్టిఫికెట్లను అందజేశారు. అనతరం డీసీఆర్‌బీ డీఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని, సమాజ ప్రశాంతతను దెబ్బతీసే మహమ్మారి వంటివన్నారు. ఒకసారి వాటికి బానిసైతే బంగారం లాంటి జీవితం నాశనమవుతుందన్నారు. యువత జీవిత లక్ష్యాలపై దృష్టి సారించి, వ్యసనాలకు పూర్తిగా దూ రంగా ఉండాలని సూచించారు. ‘యాంటీ డ్రగ్ సోల్జర్’ సర్టిఫికెట్ కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం సమాజంలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యతకు ప్రతీ క అన్నారు. అనంతరం విద్యార్థినుల భద్రతపై అవగాహన కల్పిస్తూ 1908 టోల్ ఫ్రీ సేవలను అవసరమైన సమయంలో వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నవీన, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పోలీసు అధికారులు, సిబ్బంది400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.


