మహబూబ్‌నగర్ రూరల్: వెల్డిండ్ పనులు చేస్తుండగా విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని ధర్మాపూర్‌లో సోమవారం జరిగింది. పూర్తి వివరాలు.. దేవరకద్ర మండలం అడవి హజిలాపురానికి చెంది న వడ్ల రాఘవేంద్రచారి (28) తన సోదరుడు నరేష్‌చారితో కలిసి గ్రామానికి చెందిన కొనగంటి నాగిరెడ్డి పొలంలో షెడ్డుకు వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్‌షాక్ తగిలి మృతి చెందాడు. షెడ్డు పైనుంచి వెళ్లే 11 కేవీ, ఎల్‌టీఈ సింగిల్ ఫేజ్, త్రీఫేజ్ విద్యుత్ లైన్ల కారణంగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతుడికి భార్య అమూల్య ప్రస్తుతం ఐదు నెలల గర్భిణిగా ఉంది. యజమాని, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ ఆరోపించారు. బాధిత కుటుంబానికి షెడ్డు యజమాని రూ. 20 లక్షలు, విద్యుత్ శాఖ రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ భూపాల్‌రెడ్డి, ఏఎస్సై దాసు సంఘటనా స్థలానికి చేరుకు ని పంచానామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతర కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.


